https://oktelugu.com/

రోహిణి కార్తెలో ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి?

2024 ఏడాదిలో మే 25 నుంచి రోహిణి కార్తె ప్రవేశం కానుంది. మే 25 నుంచి జూన్ 8 వరకు ఇది కొనసాగుతుంది. సాధారణంగా రోహిణి కార్తె అనగానే ఎండలు మండిపోతాయంటారు. రోళ్లు పగిలే ఎండలు కొడుతాయని అంటారు. అయితే రోహిణి కార్తెలో సూర్యుడు నడి నెత్తిపై ఉన్నట్లు కనిపిస్తాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 25, 2024 / 12:47 PM IST

    Rohini Karthi 2023

    Follow us on

    సమ్మర్ అంటే చాలా మంది హడలెత్తిపోతారు. ఎండవేడి, ఉక్కపోత భరించలేకపోతారు. ఈ ఏడాది ఎండలు దంచి కొట్టాయి. మే ప్రారంభ కాకముందే సూర్యుడు ప్రతాపం చూపించాడు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే తాజాగా రోహిణి కార్తె ప్రవేశించింది. సాధారణ ఎండలు ఉన్న సమయంలో రోహిని కార్తె ప్రవేశించగానే మరింత దంచి కొడతాయి. అంటే ఇప్పటికే ఎండి వేడితో భరించలేని ప్రజలు ఇక నుంచి మరింత ఉష్ణోగ్రతలతో సమతమతం కానున్నారు. అయితే రోహిణి కార్తె అంటే ఏమిటి? ఈ కార్తె ప్రవేశంతో ఎండలు ఎందుకు ఎక్కువగా కొడుతాయి?

    2024 ఏడాదిలో మే 25 నుంచి రోహిణి కార్తె ప్రవేశం కానుంది. మే 25 నుంచి జూన్ 8 వరకు ఇది కొనసాగుతుంది. సాధారణంగా రోహిణి కార్తె అనగానే ఎండలు మండిపోతాయంటారు. రోళ్లు పగిలే ఎండలు కొడుతాయని అంటారు. అయితే రోహిణి కార్తెలో సూర్యుడు నడి నెత్తిపై ఉన్నట్లు కనిపిస్తాడు. దీంతో భూమిపై ఉన్న తేమ వెంటనే ఆరిపోతుంది. దీంతో ప్రతీ వస్తువు వేడిగా మారుతుంది. ఈ క్రమంలో రోళ్లు కూడా వేడెక్కి పగిలిపోతాయని, అందువల్ల రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు ఉంటాయని అంటారు.

    ఇక రోహిణి కార్తె గురించి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ సమయంలో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. ఉగాది పండుగ నుంచి ఎండలు మొదలై రోహిణి కార్తెలో చివరి సారిగా తీవ్ర స్థాయికి చేరుతాయి. ఆ తరువాత వర్షాకాలం ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ కార్తెలో ఎండలు తీవ్రంగా ఉంటాయి.