Homeఎంటర్టైన్మెంట్Rishab Shetty: తెలుగు స్టార్ హీరోలకు కథలు వినిపిస్తున్న రిషబ్ శెట్టి...వర్కౌట్ అవుతుందా..?

Rishab Shetty: తెలుగు స్టార్ హీరోలకు కథలు వినిపిస్తున్న రిషబ్ శెట్టి…వర్కౌట్ అవుతుందా..?

Rishab Shetty: ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల హవా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన వాళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఇండియా వైడ్ గా వాళ్లకు భారీ పాపులారిటి వచ్చింది. వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ల నుంచి వచ్చే ప్రతి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ని మొదలుపెట్టిన రిషబ్ శెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. ‘కాంతార’ సినిమాతో ఆయన భారీ విక్టరీని సాధించాడు. ఇక ‘కాంతార చాప్టర్ వన్’ సినిమా భారీ లాభాలను తీసుకొచ్చి పెట్టింది. దాంతో రిషబ్ శెట్టి డైరెక్షన్లో నటించడానికి చాలామంది హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయన తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలకు కథలు కూడా వినిపించారట.

Also Read: ‘ఫౌజీ’ సినిమా టీజర్ లో ప్రభాస్ అలా కనిపించబోతున్నాడా..?

జూనియర్ ఎన్టీఆర్ కి కథను వినిపించిన ఆయన తో పాటు ప్రభాస్ కి కూడా ఒక కథనైతే చెప్పారట. వాళ్ళిద్దరు ఆ రెండు కథల్ని హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరితో రిషబ్ శెట్టి డైరెక్షన్ లో చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి రిషబ్ శెట్టి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది.

ఎన్టీఆర్ ఎప్పుడు బెంగళూరు వెళ్లిన కూడా రిషబ్ శెట్టి ని కలుస్తారట. రిషబ్ శెట్టి ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ని కలవకుండా వెళ్లడు. అలాంటి ఒక మంచి బాండింగ్ అయితే కుదిరింది. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆ సినిమాలు ముగిసిన తర్వాత సినిమాలు చేస్తారట… ప్రభాస్ సైతం ఇప్పటికే అరడజన్ సినిమాల వరకు కమిటై ఉన్నాడు.

కాబట్టి ఆ సినిమాలు పూర్తవడానికి మరో నాలుగు సంవత్సరాల సమయమైతే పట్టే అవకాశాలున్నాయి. ఆ నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన రిషబ్ శెట్టితో సినిమా చేస్తాడనే వార్తలైతే వస్తున్నాయి…ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టాడట…ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందో చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version