Nagarjuna Role Comparison With Naga Chaitanya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులందరిని అలరిస్తున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పిస్తున్నాయి. తన కొడుకు అయిన నాగచైతన్య సైతం ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికి ఆయనకు ఆశించిన మేరకు విజయాలు రావడం లేదు. ఇక ప్రస్తుతం ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్న ‘వృషకర్మ’ సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు… నిజానికి నాగార్జున సైతం చేయనటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ను నాగచైతన్య పోషిస్తున్నారట. వృషకర్మ సినిమాలో అతని క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఇప్పటివరకు నాగార్జున సైతం అలాంటి పాత్రనైతే పోషించలేదని అక్కినేని అభిమానులు సైతం సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు నాగార్జున చేసిన ప్రతి పాత్రతో తనకు ఒక గుర్తింపైతే వచ్చింది.
Also Read: ‘ఫౌజీ’ సినిమా టీజర్ లో ప్రభాస్ అలా కనిపించబోతున్నాడా..?
కానీ నాగచైతన్య చేసిన పాత్రల్లో పెద్దగా వైవిధ్యమైతే ఉండడం లేదు. కానీ వృషకర్మ సినిమాలో ఆయన చేస్తున్న పాత్ర అతనికి గుర్తింపుతో పాటు ఒక భారీ సక్సెస్ ని కూడా కట్టబెడుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో నాగచైతన్య తో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఈ లెక్కన ఆయన వృషకర్మ సినిమాతో పాటు ఆ తర్వాత రాబోయే సినిమాలతో సక్సెస్ సాధిస్తే ఆయన కూడా టైర్ హీరోగా మారే అవకాశాలైతే ఉన్నాయి… ఇప్పటివరకు స్టార్ హీరోలు చేసిన సినిమాలు వాళ్లను అలరిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాయి. కానీ ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
నాగచైతన్య తనకు సెట్ అయ్యే కథను సెలెక్ట్ చేసుకొని మరి ముందుకు సాగుతున్నాడు. మూస ధోరణిలో కాకుండా డిఫరెంట్ సినిమాలను చేయడంలో నాగచైతన్య సైతం ముందు వరుసలో ఉన్నాడు…అన్ని అనుకున్నట్టుగా జరిగితే నాగ చైతన్య ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ను సాధిస్తాడనే చెప్పాలి…