https://oktelugu.com/

Radha Ashtami 2024 : అంత ప్రేమించిన రాధను.. ఎందుకు కృష్ణుడు వివాహం చేసుకోలేదు?

రాధాకృష్ణులు కూడా జీవితాంతం కలిసుండాలని ఆ దేవుడు రాసి పెట్టలేదు. అందుకే రాధ.. కృష్ణుడి గుండెలో ఉండిపోయింది. కానీ తన జీవితంలో ఉండలేకపోయింది. ఏది ఏమైనా వీళ్ల ప్రేమకు దేనితోనూ పోటీ చేయలేం

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 26, 2024 / 10:09 PM IST

    krishna radha

    Follow us on

    Radha Ashtami 2024 : ప్రేమకు ప్రతీకగా రాధాకృష్ణులని చూపిస్తుంటాం. అంతలా కృష్ణుడు రాధను ఇష్టపడ్డాడు. రాధ కూడా కృష్ణుని కంటే ఎక్కువగా ప్రేమించింది. కృష్ణుడికి ఎంత మంది భార్యలు ఉన్నా, గోపికలు ఉన్నా తన మనస్సు మాత్రం ఎప్పుడు రాధ మీదే ఉంటుంది. ఇద్దరూ దేహాలు కలవక పోయిన వాళ్ల మనసులు మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటాయి. రాధాకృష్ణుల ప్రేమ అసలు వెలకట్టలేనిది. చాలామంది రాధాకృష్ణులా ఉండండి అని కూడా దీవిస్తారు. వీళ్ల ప్రేమ ఎంత గొప్పదో ఈ ఒక్క మాటతో మనకు అర్థం చేసుకోవచ్చు. అయితే మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ప్రాణం కంటే ఎక్కువగా రాధను ప్రేమించిన కృష్ణ.. అసలు రాధను ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇంతకీ రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదంటారు. తెలియాలంటే పూర్తి స్టోరీ చదివేయండి.

    రాధాకృష్ణులు ఎంతో ప్రేమగా ఉండేవారు. అయితే శ్రీకృష్ణుడు వీర్జతో కలిసి ఉండటం ఓ రోజు రాధ చూసి కోపగించుకుంది. ఆ తర్వాత కృష్ణుడు తనకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ దానికి ఒప్పుకోలేదు. దీంతో కృష్ణుడు స్నేహితుడు అయిన సుధాముడు వీరిద్దరిని కలపడానికి ప్రయత్నించాడు. అప్పుడు కూడా రాధ నిరాకరించింది. సుధాముడు ఎంత ట్రై చేసినా కూడా రాధ ఒప్పుకోకుండా దుర్భాషలాడింది. దీంతో సుధాముడు ఈ జన్మలోనే కాదు.. ఏ జన్మలో కూడా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని శపించాడు. ఆ తర్వాత కూడా కృష్ణుడు గోకులం వదిలి వెళ్లి పోవడంతో ఇద్దరి ప్రేమకు అవాంతరాలు ఏర్పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత జన్మలో రాధ లక్ష్మీ అంశంగా కొలుస్తారు. అప్పుడు కూడా కృష్ణుని రాధ తిరస్కరించిందని అంటున్నారు.

    ఇదెలా ఉండగా రాధ ఒక వైశ్య రాయన్నుని పెళ్లి చేసుకుందని సమాచారం. ఆ తర్వాత తన ఇంట్లో ఓ విగ్రహాన్ని స్థాపించి.. వైకుంఠానికి వెళ్లిందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆమె లక్ష్మీ దేవి అవతారం అని చెబుతుంటారు. అయితే కృష్ణుడు తనకి కావాల్సిన వాటిన్నింటిని పొందిన.. తనకి ఇష్టమైన రాధను మాత్రం పొందలేకపోయాడు. తన తలరాతలో లేని రాధనే కృష్ణుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఇదెలా ఉండగా రాధాకృష్ణులది వేర్వేరు కులాలు. ఆ రోజుల్లో పెళ్లికి వేరే కులం అయితే అంగీకరించేవాళ్లు కాదు. రాధ ఓ గోకాపరి కుమార్తె. కృష్ణుడు ఓ రాజకుమారుడు. ఇంతటి రాజకుమారుడితో తన వివాహం జరగదని రాధ అనుకుంది. ఈ కారణంతోనే రాధకు.. కృష్ణుడి మీద ప్రేమ ఉన్నా సరే.. పైకి మాత్రం కోపంగా ప్రవర్తించిందని పురాణాలు చెబుతున్నాయి. ఎంతగా ప్రేమించినా, కోరుకున్న తలరాతలో లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు. రాధాకృష్ణులు కూడా జీవితాంతం కలిసుండాలని ఆ దేవుడు రాసి పెట్టలేదు. అందుకే రాధ.. కృష్ణుడి గుండెలో ఉండిపోయింది. కానీ తన జీవితంలో ఉండలేకపోయింది. ఏది ఏమైనా వీళ్ల ప్రేమకు దేనితోనూ పోటీ చేయలేం.