https://oktelugu.com/

Onam 2024 : ఈ ఏడాది ఓనం పండుగ ఎప్పుడు? దీని ప్రత్యేకత ఏంటంటే?

ఓనం ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు పది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సంప్రదాయంగా జరిగే ఈ పండుగ చివరిగా తిరుఓనంతో పూర్తి అవుతుంది. అయితే కేరళ వాళ్లు ఓనం పండుగ జరుపుకోవడానికి కారణం ఏంటి? దీని విశిష్టత ఏంటో మరి తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 12, 2024 / 02:55 PM IST

    Onam Festival

    Follow us on

    Onam 2024 : భారత దేశం ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకమైన పండుగ ఉంటుంది. అయితే చాలా మందికి కేరళ అంటే చాలా ఇష్టం. పచ్చని ప్రకృతి, ఆ అడవులు అన్నిటిని లైఫ్ లో ఒక్కసారి అయిన చూడాలని అందరూ అనుకుంటారు. అయితే కేరళలోని పండుగల్లో ఓనం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబర్ లో వస్తుంది. ఓనం ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు పది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సంప్రదాయంగా జరిగే ఈ పండుగ చివరిగా తిరుఓనంతో పూర్తి అవుతుంది. అయితే కేరళ వాళ్లు ఓనం పండుగ జరుపుకోవడానికి కారణం ఏంటి? దీని విశిష్టత ఏంటో మరి తెలుసుకుందాం.

    వామన పురాణం బట్టి రాక్షసుల నుంచి భూమండలాన్ని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తుతాడు. ఆ సమయంలో మహావిష్ణువు బలి చక్రవర్తిని మూడు అడుగుల నేలను దానంగా చేయమని అడుగుతాడు. అలా మహావిష్ణువు ఒక అడుగు భూమిపై వేయగా.. రెండో అడుగు ఆకాశంపై వేస్తాడు. ఇక మూడో అడుగు ఎక్కడ వేయాలని బలి చక్రవర్తిని శ్రీ మహావిష్ణువు కోరాడు. అయితే గొప్ప దానశీలి అయిన బలి చక్రవర్తి.. శ్రీ మహావిష్ణువు అతన్ని దానం అడుగుతున్నాడని తెలుసుకుని మూడో అడుగు తన తలపై వేయమని అంటాడు. అప్పుడు బలి చక్రవర్తి సంవత్సరానికి ఒకసారి తాను భూమిపైకి వచ్చే విధంగా వరం ఇవ్వమని కోరాడు. దీనికి విష్ణుమూర్తి ఒప్పుకుని.. బలి చక్రవర్తిపై మూడవ అడుగు వేసి పాతాళానికి తొక్కేస్తాడు. అలా బలి చక్రవర్తి ఏడాదికి ఒక్కసారి భూమిపైకి వచ్చే విధంగా ఓనం పండుగను కేరళ ప్రజలు జరుపుకుంటారు.

    సంస్కృతి, సంప్రదాయాలను బట్టి కేరళ ప్రజలు ఓనం పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు కేరళ ప్రజలు వాళ్ల సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ జరుపుకోవడం వల్ల జీవితంలో సంతోషం ఉంటుందని కేరళ ప్రజల నమ్మకం. కేరళ వ్యాప్తంగా కుల, మత బేధం లేకుండా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో ఎన్నో రకాల వంటకాలు చేస్తారు. ముఖ్యంగా సాధ్య భోజనం చాలా ప్రధానమైనది. సాధ్య భోజనం అంటే అరటి ఆకులో సాంబార్ అన్నం, అవియల్, పుట్టు, కొబ్బరి పాయసం, తయ్యర్, అరటి చిప్స్ వంటి రకరకాల ఆహార పదార్ధాలను భోజనంలో ఏర్పాటు చేస్తారు. ఇది చాలా ముఖ్యమైనది. అలాగే ఈ పండుగ సమయంలో ఎన్నో సంప్రదాయ కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా పడవ పందాలు చాలా బాగా చేస్తారు. చూడటానికి ఇవి చాలా బాగా ఉంటాయి. లైఫ్ లో ఒక్కసారి అయిన వీటిని చూడాల్సిందే. మరి మీరు ఎప్పుడైనా ఓనం పండుగను చూడటానికి కేరళ వెళ్లారా? వెళ్తే కామెంట్ చేయండి.