Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తున్న వారిలో ఒకరు సోనియా ఆకుల. హౌస్ లో అడుగుపెట్టిన రోజు నుండి ఈమె చాలా యాటిట్యూడ్ తో ప్రవర్తిస్తుంది, చాలా పొగరు, నోటికి ఏది తోచితే అది మాట్లాడుతుంది, ఇలా ఆడియన్స్ లో పలు రకాల అభిప్రాయాలను ఏర్పర్చుకుంది ఈమె. కానీ ఈమె పైకి కనిపించేంత కఠినమైన స్ట్రాంగ్ అమ్మాయి కాదు. చాలా సున్నితమైన మనసు కలిగిన అమ్మాయి. ఈమె బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన కొన్ని వివరాలు చూసిన తర్వాత సోనియా ఎంత మంచి అమ్మాయి అనేది అర్థం అవుతుంది. తెలంగాణ లోని ఒక మారుమూల గ్రామానికి చెందిన మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈ అమ్మాయికి చిన్నతనం నుండే నలుగురికి ఉపయోగపడాలి అనే గొప్ప మనస్తత్వం ఉండేది.
ఆ క్రమంలోనే ఆమెకి కలెక్టర్ అవ్వాలని కోరిక పుట్టింది. చిన్నతనం లో ఆమె ఒకే ఒక్క సంతకం తో జనాల బ్రతుకులు మార్చేసిన కొంతమంది కలెక్టర్స్ ని చూసి ఆమెకి ఇలాంటి ఆలోచన పుట్టిందట. కానీ ఆ ఒక్క సంతకం పెట్టడానికి ఎన్ని చేతులు మారాల్సి వచ్చేదో, ఎంతమంది ముందు తలవంచాల్సి వచ్చేదో, సంతకం పెట్టిన తర్వాత పనులు కార్యరూపం దాల్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టేదో కళ్లారా చూసిందట. దీంతో ఆమెకి ఎదో ఒకటి చేయాలనీ ఉండేది కానీ, తాను అనుకున్న లక్ష్యానికి చేరువ అయ్యేందుకు ఏ మాధ్యమం ద్వారా వెళ్లాలో అర్థం అయ్యేది కాదట. అలాంటి సమయంలో ఆమెకు సినిమాల్లో అవకాశం వచ్చిందట. ఇది ఆమె ఊహించని సంఘటన అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అలా సినిమాలు చేస్తూ, మధ్యలో యాంకర్ గా కొనసాగుతూ, దాని ద్వారా వచ్చే డబ్బుల్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ తన జీవితాన్ని గడుపుతుండేదట.
ఇలా చాలా సింపుల్ జీవితాన్ని గడిపే సోనియా ని చూసి, నువ్వు ఒక్క దాని మీద ఫోకస్ గా లేవు, సినిమాలు చేస్తున్నావ్, యాంకర్ గా చేస్తున్నావ్, సేవా కార్యక్రమాలు చేస్తున్నావ్, ఇలాగే పోతే పెద్ద రేంజ్ కి వెళ్లి సక్సెస్ కాలేవు అని ఆమె స్నేహితులు అనేవారట. కానీ అవేమి పట్టించుకోకుండా తన ప్రయాణం సాగించింది. అవకాశాలు లేని సమయాల్లో ఆమె ట్యూషన్స్ కూడా చెప్పెదట. అలా బ్రతకడానికి తోచిన పని చేసుకుంటూ ముందుకు వెళ్లే ఆమెకు సినిమాల్లో స్థిరమైన స్థానం లో నిలబడే స్థాయికి వచ్చిందట. తన మిత్రులతో కలిసి సొంతంగా ఒక NGO ని స్థాపించింది. ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు తలపెట్టింది. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో రేషన్ కొంతమంది కంటెస్టెంట్స్ కి మాత్రమే ఇవ్వడంపై సోనియా చాలా బాధపడింది. ఎంతోమందికి ఉచితంగా ఆహరం పంచిన చేతులివి. అలాంటిది కలిసి ఒకే చోట ఉంటూ ఇలా కొందరికే ఆహారం దొరకడం పై ఆమె కంటతడి పెట్టింది. ప్రస్తుతం సోనియా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గానే కొనసాగుతుంది, భవిష్యత్తులో ఆమె ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.