https://oktelugu.com/

Dussehra 2024 : ఆడపడుచులు ఎదురుచూసే పండగ రానే వచ్చింది. దసరా ఏ రోజు? పూజా సమయం ఎప్పుడు?

దసరా పాప వినాశనానికి ప్రతీకగా నిలిచింది. దసరా రోజున కొన్ని చోట్ల దుర్గామాత విగ్రహం, కలశం, దుర్గామాత నిమజ్జనం వంటివి కూడా చేస్తుంటారు భక్తులు.

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2024 / 06:39 PM IST
    Follow us on

    Dussehra 2024 : ఈ నెల మొత్తం పండగ వాతావరణంతో సందడి కానుంది. ప్రస్తుతం బొడ్డెమ్మ పండుగతో వాకిల్లు కలకల లాడుతున్నాయి. ఇక బతుకమ్మ పండగ కూడా రెండు రోజులే ఉంది కాబట్టి ఆడపడుచులు ఫుల్ గా ఎదురుచూస్తున్నారు. పెద్దబతుకమ్మ అయితే వచ్చేది దసరా. ఈ దసరా ఉత్సవాలకు కూడా సమయం సమీపిస్తోంది. ఒక రాష్ట్రం మాత్రమే కాదు మొత్తం దేశ వ్యాప్తంగా ఈ పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. విజయదశమి రోజును అసత్యంపై సత్యం, పాపంపై పుణ్యం సాధించిన రోజుగా విజయదశమిని నిర్వహించుకుంటారు. నవరాత్రులు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి దసరా ఎప్పుడు…పూజా ముహూర్తం ఎప్పుడు ఉంది? ఏ సమయానికి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    పండుగ ఏ రోజు: విజయదశమికి ప్రతీ సంవత్సరం కూడా ప్రత్యేకంగానే అనిపిస్తుంటుంది. ఈ విజయదశమికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. శ్రీరాముడు రావణుడిని సంహరించి చెడుపై మంచి విజయం సాధించాలనే సందేశం ఉంటుంది ఈ రోజుకు. విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడిని ఓడించింది కాబట్టి ఈ రోజుకు ప్రత్యేకత సంతరించుకుంది. ఈ విజయదశమి రోజున శమీ, అపరాజితలను పూజిస్తుంటారు. పండుగ దశమి తిథి అక్టోబర్ 12, 2024 ఉదయం 10:58 గంటలకు ప్రారంభం అవుతుంది అంటున్నారు పండితులు. అక్టోబర్ 13, 2024 ఉదయం 09:08 వరకు కొనసాగునుందట. అక్టోబర్ 12న దసరా జరుపుకోవాలని వివరించారు పండితులు.

    అక్కడ మాత్రం ఇలా: శాస్త్రాల ప్రకారం విజయదశమి లేదా దసరా నాడు శ్రావణ నక్షత్రం ఉండటం చాలా మంచి రోజుగా చెబుతున్నారు. 2024 సంవత్సరంలో శ్రవణ నక్షత్రం అక్టోబర్ 12 ఉదయం 5:25 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 13 తెల్లవారుజామున 4:27 గంటలకు ముగుస్తుంది అంటున్నారు పండితులు. ఈ సంవత్సరం విజయదశమి రోజున పూజ సమయం మధ్యాహ్నం 2:02 నుంచి 2:48 వరకు ఉందట. దీని మొత్తం వ్యవధి దాదాపు 46 నిమిషాలు అంటున్నారు పండితులు. బెంగాల్‌లో దసరా పండుగను ఈ సంవత్సరం అక్టోబర్ 13, 2024న అంటే ఆదివారం జరుపుకుంటారట.

    దశమి ప్రత్యేకత: ఈ రోజున పూజ శుభ సమయం మధ్యాహ్నం 1:16 నుంచి 3:35 వరకు కొనసాగనుంది. ఆరాధన మొత్తం వ్యవధి సుమారు 2 గంటల 19 నిమిషాలు ఉంటుంది. విజయదశమి పండుగను శక్తి, ధైర్యానికి చిహ్నంగా చెబుతుంటారు. రావణుడితో చేసిన యుద్ధంలో రాముడి బలం, ధైర్యం ప్రదర్శించాయి కాబట్టి విజయదశమి అంటే ధైర్యసాహసాలు అని చెబుతుంటారు పెద్దలు. దసరా పాప వినాశనానికి ప్రతీకగా నిలిచింది. దసరా రోజున కొన్ని చోట్ల దుర్గామాత విగ్రహం, కలశం, దుర్గామాత నిమజ్జనం వంటివి కూడా చేస్తుంటారు భక్తులు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..