https://oktelugu.com/

Ekadashi 2024 : అజ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? ఎలాంటి నియమాలు పాటించాలి?

అజ ఏకాదశి రోజు మహా విష్ణువు భక్తి శ్రద్ధలతో పూజిస్తే పుణ్యం లభించడంతో పాటు సుఖసంతోషాలతో ఉంటారు. అయితే ఏకాదశి రోజు కొన్ని నియమాలు పాటించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఈ అజ ఏకాదశి పూజను ఉపవాసం ఉన్న రోజు చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం 4:39 గంటల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 29, 2024 / 03:16 PM IST

    Ekadashi 2024

    Follow us on

    Ekadashi 2024 : ప్రతి నెలలో వచ్చే ప్రతి ఏకాదశికి పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా ఏకాదశి రోజునే విష్ణుమూర్తిని పూజించి, ఉపవాస దీక్ష పాటిస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ అజ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఈ ఏకాదశి గురువారం ఆగస్టు 29, మధ్యాహ్నం 1:19 గంటలకు ప్రారంభమయ్యి.. శుక్రవారం ఆగస్టు 30 మధ్యాహ్నం 1:37 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ఈ ఏకాదశికి రెండు శుభ యోగాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అందులో ఒకటి సిద్ధి యోగం. మరొకటి సర్వార్థ సిద్ధ యోగం. సిద్ధి యోగం ఉదయం నుంచి సాయంత్రం 6:19 నిమిషాల వరకు ఉంటుంది. సర్వార్ధ సిద్ధి యోగం ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 4:39 నుంచి మరుసటి రోజు ఉదయం 5:58 వరకు ఉంటుంది. అయితే ఈ యోగాల్లో పూజలు నిర్వహించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

    ఎలా పూజించాలంటే?
    అజ ఏకాదశి రోజు మహా విష్ణువు భక్తి శ్రద్ధలతో పూజిస్తే పుణ్యం లభించడంతో పాటు సుఖసంతోషాలతో ఉంటారు. అయితే ఏకాదశి రోజు కొన్ని నియమాలు పాటించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఈ అజ ఏకాదశి పూజను ఉపవాసం ఉన్న రోజు చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం 4:39 గంటల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఇలాంటి సమయంలో విష్ణువును కొలిస్తే శభ ఫలితాలు ఉంటాయి. అయితే ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి సాన్నం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించి మహా విష్ణువును కొలిచి ఉపవాసం ఉంటానని దేవుడికి మాట ఇవ్వాలి. తులసి మొక్కను మహా విష్ణువుకి కొలుస్తారు. కాబట్టి తులసి మొక్కను పూజించాలి. ఆ తర్వాత విష్ణువు మంత్రాలను భక్తి శ్రద్ధలతో జపించాలి. ఆ తర్వాత అజ ఏకాదశి కథ వినాలి. ఆహారం, బట్టలు, డబ్బు, ధాన్యాలు వంటివి దానం చేయాలి. ఆ తర్వాత విష్ణువును కొలుస్తూ భజన చేయాలి. ఆ తర్వాతే పండ్లు, పాలు, పళ్లు రసాలు వంటివి తీసుకోవాలి. అంతవరకు ఉపవాస దీక్ష పాటించాలి. అయితే కొందరు పూర్తిగా ఏం తినకుండా ఉంటారు. కొందరు కేవలం ఒక పూట మాత్రమే తింటారు.

    ఈ పనులు చేయవద్దు
    ఈ రోజు వేరే ఇతర పనులు పెట్టుకోకుండా విష్ణువును భక్తి శ్రద్ధలతో కొలుస్తుండాలి. రోజంతా ఆహారం తీసుకుకుండా దేవుడిని మాత్రమే కొలవాలి. అలాగే ఆటలు, కోపం, హింస వంటి వాటికి దూరంగా ఉండాలి. మాంసం, చేపలు, గుడ్లు, మద్యం వంటివి తీసుకోకూడదు. ఈ నియమాలు అన్ని అజ ఏకాదశి రోజున పాటిస్తే మంచి ఫలితాలుంటాయి.