Rakhi Purnima 2024: ఆ సమయంలో రాఖీ కడితే ఏమవుతుంది? అసలు రాఖీ కట్టే సమయం ఏది? పురోహితులు ఏం చెబుతున్నారంటే?

2024 ఏడాదిలో ఆగస్టు 19న రాఖీ పండుగను నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహిళలు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు తమ సోదరులకు రాఖీ కట్టడానికి ఊళ్లకు పయనమయ్యారు. మరికొందరు పోస్టుల ద్వారా రాఖీలు పంపిస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : August 19, 2024 9:55 am

Rakhi Purnima 2024(1)

Follow us on

Rakhi Purnima 2024: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకుంటారు. ప్రతీ ఏడాదిలో శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ప్రతీ సంవత్సరం రాఖీ పండు రోజు కొన్ని సమయాల్లో మాత్రమే రాఖీ పండుగను నిర్వహించుకోవాలని అంటుంటారు. ఈసారి కూడా కొన్ని సమయాల్లో రాఖీ పండుగ చేసుకోవద్దని కొందరు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం 5.53 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు రాఖీ కట్టొద్దని కొందరు చెబుతున్నారు. ఈ సమయంలో భద్రకాలం ఉంటుందని చెబుతున్నారు. అసలు భద్రకాలం అంటే ఏమిటి? ఈ సమయంలో ఎందుకు రాఖీ కట్డొద్దు?

2024 ఏడాదిలో ఆగస్టు 19న రాఖీ పండుగను నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహిళలు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు తమ సోదరులకు రాఖీ కట్టడానికి ఊళ్లకు పయనమయ్యారు. మరికొందరు పోస్టుల ద్వారా రాఖీలు పంపిస్తున్నారు. అయితే రాఖీ కట్టేంందుకు ఆగస్టు 19న సరైన సమయం లేనందున కొందరు ఆగస్టు 18నే రాఖీ పండుగను నిర్వహించుకున్నారు. అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు.. వెళ్లేవారు ముందుగానే ఈ వేడుకలో పాల్గొన్నారు.

అయితే ఈరోజు రాఖీ పండుగ ను ఉదయం 5.53 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు రాఖీ కట్టకపోవడానికి భద్రకాలం ఉందంటున్నారు. కొన్ని పురాణాల్లో భద్ర కథ ఉంది. రావణాసురుడి చెల్లెలు భద్ర. ఈమె రాఖీ సందర్భంగా తనసోదరుడికి రాఖీ కట్టింది. అయితే రాఖీ పౌర్ణమి రోజున కాకుండా ఒక రోజు ముందు అశుభ సమయంలో కట్టింది. దీంతో రామ, రావణ యుద్దంలో భద్ర చనిపోతుంది. దీంతో అశుభ సమయంలో రాఖీ కట్టడం వల్ల భద్ర చనిపోయిందని, అందువల్ల శుభ గడియల్లోనే రాఖీ కట్టాలని అంటున్నారు. అంతేకాకుండా ఆ కాలాన్ని అప్పటి నుంచి భద్ర కాలంగా పేర్కొంటున్నారు. అంటే భద్రకాలంలో రాఖీ కట్టడం వల్ల సోదరుడు లేదా సోదరీమణులకు అపాయం ఉంటుందని కొందరు చెబుతున్నారు.

అయితే కొందరు వీటిని కొట్టి పారేస్తున్నారు. రాఖీ పండుగకు అలాంటి చరిత్రలేమీ లేవని చెబుతున్నారు. కొందరు మాత్రం సోదరులు, సోదరీమణులకు ఎలాంటి అశుభం జరగకుండా ఉండాలని కోరుకుంటూ రాఖీ పండుగను మధ్యాహ్నం తరువాతనే జరుపుకోవాలని చూస్తున్నారు. ఇక రాఖీ పండుగ నిర్వహించుకునే సమయంలో శుచి శుభ్రతతో ఉండాలని అంటున్నారు. అలాగే రాఖీ కట్టే సమయంలో సోదరుడు తూర్పు వైపు ముఖం పెట్టి కూర్చోవాలి. రాఖీ కట్టే వారు పడమర వైపు తిరిగి తన సోదరుడికి రాఖీ కట్టాలి… అని చెబుతున్నారు.

రాఖీ పండుగను అత్యంత సంతోషంగా జరుపుకోవాలని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈరోజు సోదరులు, సోదరీమణులు ఎలాంటి గోడవలు పడకుంగా సంతోషంగా ఉండాలని అంటున్నారు. ఎలాంటి పరుష వ్యాఖ్యలు పలకకుండా ఆప్యాయతగా ఉండాలి. ఇక రాఖీ కట్టినందుకు సోదరులు తమ చెల్లెళ్లకు విలువైన బహుమతులు ఇచ్చి సంతోష పర్చాలి. వారు ఎలాంటి అలక లేకుండా చూసుకోవాలని అంటున్నారు. అంతేకాకుండా అశుభాలు మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండాలి. అన్నా చెల్లెళ్లకు ప్రతిరూపంగా నిర్వహించుకునే ఈ వేడుకను అత్యంత సంబరంగా నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు.