Imanvi: సోషల్ మీడియా షేక్ చేస్తోంది.. ఏకంగా ప్రభాస్ పక్కనే ఛాన్స్ ఇచ్చింది.. కావాల్సింది టాలెంటే

ఫిల్మ్ మేకర్స్ ఆలోచన ధోరణి మారుతుంది. ఫేమ్, మార్కెట్, పాపులారిటీ ఆధారంగా హీరో, హీరోయిన్స్ ని ఎంపిక చేసుకునే విధానం వదిలేస్తున్నారు. ఈ జనరేషన్ డైరెక్టర్స్ టాలెంట్ ఉంటే చాలు కొత్తవారికి కూడా ఆఫర్స్ ఇస్తున్నారు. ఇమాన్వి అనే ఓ యంగ్ బ్యూటీ ఏకంగా ప్రభాస్ పక్కన పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ పట్టేసింది.

Written By: S Reddy, Updated On : August 19, 2024 9:50 am

Imanvi

Follow us on

Imanvi: రాజమౌళి దేశం మెచ్చిన తిరుగులేని దర్శకుడు. కానీ ఆయన క్యాస్టింగ్ వ్యాపార కోణంలో ఉంది. వందల కోట్ల బడ్జెట్ మూవీకి మార్కెట్ జరగాలంటే స్టార్ క్యాస్ట్ ఉండాలని ఆయన భావిస్తారు. వివిధ పరిశ్రమలకు చెందిన నటులను భాగం చేస్తాడు. ఆయన గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా అలియా భట్ ని తీసుకున్నారు. అలియా భట్ నటించడం నార్త్ ఇండియాలో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ప్లస్ అవుతుందని ఆయన భావన. నిజానికి అలియా భట్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అంత చిన్న పాత్రకు పేరు లేని హీరోయిన్ ని తీసుకున్నా సరిపోతుంది.

కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించే స్టార్ డైరెక్టర్స్ ఇలానే ఆలోచిస్తారు. అవసరం ఉన్నా లేకున్నా ఇతర పరిశ్రమల నుండి కోట్లు కుమ్మరించి హీరోయిన్స్ ని తెచ్చుకుంటారు. ఫేమ్ లేని హీరోయిన్స్ పట్ల ఆసక్తి చూపరు. అయితే ఈ తరం దర్శకుల ఆలోచనా విధానం మారింది. ఫేమ్, పాపులారిటీ కంటే… పాత్రకు సదరు హీరోయిన్ సెట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు. టాలెంట్ ఉంటే తమ ఊహకు సరిపడే సాధారణ అమ్మాయిలకు కూడా అవకాశాలు ఇస్తున్నారు.

ఒక సీరియల్ నటి అయిన పాయల్ రాజ్ పుత్ కి ఆర్ ఎక్స్ 100 లో ఛాన్స్ ఇచ్చి ఆమె ఫేట్ మార్చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. హీరో కార్తికేయకు కూడా పెద్ద ఫేమ్ లేదు కాబట్టి దీన్ని సాహసం అనలేము. కానీ హను రాఘవపూడి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి డెబ్యూ హీరోయిన్ ని ఎంపిక చేశాడు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

ప్రభాస్ తో హను రాఘవపూడి చేస్తున్న పీరియాడిక్ వార్ అండ్ లవ్ డ్రామాకు ఫౌజి టైటిల్ అనుకుంటున్నారు.ఈ మూవీ బడ్జెట్ రూ. 500 కోట్లకు పైమాటే. మరి ఇంత భారీ బడ్జెట్ చిత్రానికి మార్కెట్ జరగాలి అంటే స్టార్ క్యాస్ట్ ఉండాలని దర్శక నిర్మాతలు భావిస్తారు. కమర్షియల్ కోణంలో అది నిజం కూడాను. హను రాఘవపూడి మాత్రం భిన్నంగా ఆలోచించాడు. ఫేమ్, మార్కెట్ అనే అంశాలు పక్కన పెట్టి హీరోయిన్ పాత్రకు సరిపోయే ఓ సాధారణ అమ్మాయిని ఎంపిక చేశాడు.

ఇమాన్వి అనే ప్రొఫెషనల్ డాన్సర్ ఫౌజి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కానుంది. ఆమె ఎంపిక వెనుక బలమైన కారణమే ఉంది. కథకు ఆమె స్కిల్స్ ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఫౌజి రెండవ ప్రపంచ యుద్ధం నాటి ప్రేమ కథ అని సమాచారం. హీరోయిన్ పాత్ర కీలకం. బహుశా హీరోయిన్ ఒక నాట్యగత్తె కూడా కావచ్చు. అందుకే ఢిల్లీకి చెందిన డాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ఇమాన్విని హను రాఘవపూడి ఎంపిక చేశాడు. కాబట్టి ఈ రోజుల్లో టాలెంట్ ఉంటే చాలు, అద్భుతమైన అవకాశాలు అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి..