Rakhi Pournami : రాఖీ పౌర్ణమి రోజు బ్లూ మూన్.. దీని విశేషాలేంటి?

శ్రావణ మాసంలో రాఖీ పండుగ ప్రత్యేకమైనది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ వేడుకలు నిర్వహించుకుంటారు. అయితే ఈసారి పౌర్ణమి ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే ఇదే రోజూ బ్లూ మూన్ ఆవిస్కృతం కానుంది. ఆగస్టు 19న భూమికి మరింత దగ్గరగా చంద్రుడు రాబోతున్నాడు.

Written By: Chai Muchhata, Updated On : August 19, 2024 10:27 am

Rakhi Pournami Day

Follow us on

Rakhi Pournami :  భూమికి అతి చేరువగా ఉన్న గ్రహం చంద్రుడు. దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరంలో మూన్ ఉంటుంది. చంద్రుడిని గ్రహం మాదిరిగానే కాకుండా దైవంగా కూడా పూజిస్తూ ఉంటాం. ఎందుకంటే కారు చీకట్లో ప్రకాశవంతమైన వెలుగులు ఇస్తూ చీకటిని పారత్రోలుతాడు. అయితే చంద్రుడు పౌర్ణమికి అటూ ఇటూ కొన్ని రోజులు మాత్రమే పరిపూర్ణంగా కనిపిస్తాడు. కానీ బ్లూ మూన్ రోజున ప్రత్యేకంగా కనిపిస్తాడు. బ్లూ మూన్ అంటే చంద్రుడు భూమి దగ్గరికి మరింతగా దగ్గరగా వస్తాడు. దీంతో పెద్దగా కనిపిస్తాడు. బ్లూ మూన్ కొన్ని సార్లు మాత్రమే ఏర్పడుతుంది. ఈ ఏడాది మూడుసార్లు బ్లూమూన్ రాబోతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

శ్రావణ మాసంలో రాఖీ పండుగ ప్రత్యేకమైనది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ వేడుకలు నిర్వహించుకుంటారు. అయితే ఈసారి పౌర్ణమి ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే ఇదే రోజూ బ్లూ మూన్ ఆవిస్కృతం కానుంది. ఆగస్టు 19న భూమికి మరింత దగ్గరగా చంద్రుడు రాబోతున్నాడు. అంటే ఇప్పుడు చూస్తున్న దాని కంటే 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీంతో మరింత ప్రకాశవంతంగా మూన్ కనిపిస్తుంది. బ్లూమూన్ ను ఇప్పటికే చాలాసారు కనిపించింది. కానీ ఈసారి 14 శాతం పెద్దదిగా కనిపిస్తుంది. ఆగస్టు 19న బ్లూ మూన్ సోమవారం మధ్యాహ్నం 2.26 గంటల నుంచి బ్లూ మూన్ కనిపించనుంది. అయితే ఇండయాలో రాత్రి నుంచి ఆగస్టు 20 వ తేదీ ఉదయం వరకు బ్లూ మూన్ ను చూడొచ్చు. బ్లూ మూన్ ఈ ఏడాదిలో మూడు సార్లు కనువిందు చేయనుంది. వీటిలో మొదటిది ఆగస్టు 19న కనిపించనుంది. ఆ తరువాత అక్టోబర్ 17, నవంబర్ 15 వతేదీల్లో కనిపిస్తుంది.

1979లో తొలిసారి బ్లూ మూన్ అనే పదాన్ని రిచర్డ్ నోల్లే అనే శాస్త్రవేత్త ఉపయోగించారు. ఆ తరువాత ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి బ్లూ మూన్ చూస్తు వస్తున్నారు. బ్లూ మూన్ కాలుష్య లేని ప్రదేశాల్లో మరింతగా చూడొచ్చు. అయితే బైనాక్యూలర్ తో చూస్తే మరింత పెద్దదిగా కనిపిస్తుంది. ఈసారి రాఖీ పౌర్ణమి రోజు బ్లూ మూన్ రావడంతో మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ బ్లూ మూన్ మూడు రోజుల పాటు ఉండనుంది. అయితే అమెరికా ప్రజలు మాత్రమే మూడు రోజులు చూడగలుగుతారు. బ్లూ మూన్ 6 కళలతో ఉంటుంది.

బ్లూ మూన్ ప్రతీ 13వ పౌర్ణమి రోజు వస్తుంది. చంద్రునికి సంబంధించి ఒక చక్రం పూర్తి కావడానికి 29.5 రోజులు పడుతుంది. దీంతో 13వ పౌర్ణమి రోజు లేదా 2.5 సంవత్సరాల తరువాత బ్లూ మూన్ కనిపిస్తుంది. చివరి సారిగా బ్లూ మూన్ ను 2023 ఆగస్టు 30న చూశారు. తురువాత సీజన్ 2026లో బ్లూ మూన్ కనిపిస్తుందని అంచనా. బ్లూ మూన్ కారణంగా చంద్రుడు ఎప్పటిలాగే ఉండకుండా భూమికి 90 శాతానికి దగ్గరగా వస్తాడు. బ్లూ మూన్ భారత్ లోనూ నేరుగా చూడొచ్చు. అయితే బీచ్ లు, కొండ ప్రాంతాల నుంచి చూస్తే మరింత ఆహ్లాదంగా కనిపిస్తుంది.