Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 24న మంగళవారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ క్రమంలో 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. పనికి రాని విషయాలను పట్టించుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది.
వృషభం:
ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. కుటుంబ సభ్యలతో మంచిగా ప్రవర్తించాలి.ఇతరులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. లేకుంటే భవిష్యత్ లో వచ్చేప్రయోజనాలు కోల్పోతారు. ఎవరితో మాట్లాడినా వ్యతిరేక సమాధానం వస్తుంది.
మిథునం:
వ్యాపారవేత్తలకు అనుకూల సమయం. ఈరోజంతా ఉల్లాసంగా పాల్గొంటారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవాళ్లకు ఆశించిన ఫలితాలు ఉండే అవకాశం. ముఖ్యమైన పనుల్లో బిజీగా గడుపుతారు.
కర్కాటకం:
ఇరుగుపొరుగువారు సాయం చేస్తారు. ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం ఉంది. వీలైనంత వరకు అహం ప్రదర్శించకుండా ఉండడం మంచిది. ఇతర వ్యక్తులను తక్కువగా అంచనా వేయొద్దు.
సింహం:
వ్యాపార వర్గానికి నిరాశే. ప్రభుత్వం రంగలోని వారికి ప్రతిష్ట పెరుగుతుంది. డబ్బు విషయంలో ఆచి తూచి గా వ్యవహరించాలి. కొన్ని అవసరాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.
కన్య:
ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. పెండింగులో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. కార్యాలయాల్లో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
తుల:
చుట్టూ వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని విషయాల్లో ఓర్పు ఉండడం అవసరం. ముఖ్యమైన పనుల్లో తెలివిగా ముందుకు సాగాలి. ఎవరిక అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.
వృశ్చికం:
కటుుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. భావోద్వేగ విషయాల్లో తొందరపాటు వద్దు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు.
ధనస్సు:
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. సోమరితనాన్ని విడిచిపెట్టాలి.
మకరం:
ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండాలి. ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ఇతరులతో అనవసర వాదనలకు దిగొద్దు. మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. సంపద పెరుగుతుంది.
కుంభం:
సహ ఉద్యోగుల సహకారం ఉంటుంది. తోబుట్టువులు మీపై ప్రేమను చూపుతారు. వ్యక్తిగత విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కార్యాలయాల్లో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి.
మీనం:
కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఇబ్బందులకు గురి చేసేవారిని పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగితే పనులు త్వరగా పూర్తవుతాయి.