https://oktelugu.com/

Mansoor Ali Khan: తమన్నా కాళ్ళ మధ్య చేతులు పెట్టి ”రా.. రా..” అనడం అసహ్యం… సీనియర్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్

రజినీకాంత్ వయసుకు తగ్గ పాత్రలో అద్భుతం చేశాడు. కథరీత్యా రజినీకాంత్ కి హీరోయిన్ లేదు. రమ్యకృష్ణ ఆయన భార్య పాత్ర చేసింది. అయితే తమన్నా గెస్ట్ రోల్ చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2023 / 09:08 AM IST

    Mansoor Ali Khan

    Follow us on

    Mansoor Ali Khan: జైలర్ మూవీ కోలీవుడ్ ఆల్ టైం టాప్ గ్రాసర్ లో ఒకటిగా నిలిచింది. ఆరు వందలకు పైగా వసూళ్లు రాబట్టింది. రజినీకాంత్ చాలా గ్యాప్ తర్వాత క్లీన్ హిట్ కొట్టాడు. ఆయన మార్కెట్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. తెలుగు, తమిళ భాషల్లో జైలర్ వసూళ్ల వర్షం కురిపించింది. సినిమా కథ అంత గొప్పగా లేకున్నా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, అనిరుధ్ మ్యూజిక్, రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను గొప్పగా మలిచాయి.

    రజినీకాంత్ వయసుకు తగ్గ పాత్రలో అద్భుతం చేశాడు. కథరీత్యా రజినీకాంత్ కి హీరోయిన్ లేదు. రమ్యకృష్ణ ఆయన భార్య పాత్ర చేసింది. అయితే తమన్నా గెస్ట్ రోల్ చేసింది. కథలో భాగంగానే సునీల్-తమన్నా మీద ఓ బోల్డ్ గ్లామరస్ సాంగ్ షూట్ చేశారు. దాదాపు ఐటెం సాంగ్ ని తలపించే ఈ సాంగ్ లో తమన్నా చాలా హాట్ గా ఉంటుంది. స్టెప్స్ కూడా అలానే వల్గర్ గా కంపోజ్ చేశారు.

    ‘నువ్వు కావాలయ్యా” అనే ఈ సాంగ్ విపరీతమైన స్పందన దక్కించుకుంది. కోట్ల వ్యూస్ దక్కాయి. సోషల్ మీడియాలో లక్షల రీల్స్ చేశారు. సెలెబ్రిటీలు కూడా ఈ పాటకు డాన్సులు చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఈ పాటపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    నువ్వు కావాలయ్యా సాంగ్ లో తమన్నా అలా రెండు కాళ్ళ మధ్య చేతులు పెట్టి రా రా అనడం దారుణంగా ఉంది. అంత సెక్సీగా నేను తీయలేదు కదా. వాళ్ళు అడగరు. అది చాలా అసహ్యమైన మూమెంట్… అని మన్సూర్ అలీ ఖాన్ అన్నాడు. ఇక్కడ సెన్సార్ సభ్యులను విమర్శించే క్రమంలో జైలర్ మూవీ సాంగ్ ని ఉదహరించారు. సరుకు అనే చిత్రంలోని సన్నివేశాలకు సెన్సార్ బోర్డు కట్స్ చెప్పిన నేపథ్యంలో ఆయన తన అసహనం బయటపెట్టాడు.