Vasantha Navaratri Utsavalu
Vasantha Navaratri Utsavalu : వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు ఉంటాయి. వీటినే గణేష్ నవరాత్రి ఉత్సవాలు అని అంటారు. అలాగే దసరా సందర్భంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. కానీ వసంత నవరాత్రి ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. దేశంలోని ఉత్తరాదిన నవరాత్రి ఉత్సవాలను ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవల ఈ సాంప్రదాయం దక్షిణాదిలోను కొనసాగిస్తున్నారు. ఈ ఉత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమై శ్రీరామనవమికి ముగుస్తాయి. అయితే వసంత నవరాత్రి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారు? వీటివల్ల ఎలాంటి విశేషాలు ఉంటాయి?
Also Read : కొత్త ఏడాది శుభాకాంక్షలు ఇలా చేప్పేయండి
ఉగాది పండుగ సందర్భంగా వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే వసంత రుతువు ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరంలో మొదటి నెలను చైత్రమాసం అంటారు. ఈ మాసంలోని శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులపాటు నవరాత్రి పూజలు చేస్తుంటారు. వసంత రుతువు ప్రారంభమైనందున చెట్లు చిగురిస్తాయి. ప్రకృతి అంతా పచ్చదనాన్ని పరుచుకుంటుంది. దీంతో ఈ ఉత్సవాలు ప్రకృతితో మమేకమై ఉంటాయని భావిస్తారు.
ప్రకృతి అందాలకు మానవులు మాత్రమే కాకుండా దేవుళ్ళు కూడా మైమరిచిపోతారని అంటారు. అలా అందమైన ప్రకృతి వసంత రుతువులో కనిపిస్తుంది. ఈ ప్రకృతిని చూసి దేవుళ్ళు కూడా మెచ్చుతారని చెబుతుంటారు. ఈ సమయంలోనే శ్రీమహావిష్ణువు శ్రీరాముడు భూమిపై అవతారం ఎత్తాడని అంటారు.
కొత్త ఏడాదిలో తొలి పండుగ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనాదిగా ఆచారంగా వస్తుంది. అయితే ఉత్తరాదిన ఈ ఉత్సవాలను ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. ఈ నవరాత్రి ఉత్సవాలు చేసేవారు గురువు దగ్గర దీక్షను స్వీకరించాలి. ఆ తర్వాత తొమ్మిది రోజులపాటు ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు ఉపవాసం ఉంటూ ఉండాలి. ఉదయం సాయంత్రం దేవుళ్లకు ప్రత్యేక అర్చనలు చేస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. శ్రీరామ నామస్మరణ చేస్తూ ఉండాలి. చివరి రోజైనా తొమ్మిదవ రోజు శ్రీరామనవమి వస్తుంది. ఆ రోజున శ్రీరామనవమి కార్యక్రమంలో పాల్గొనాలి.
ఈ విధంగా చేయడం వల్ల కుటుంబం సంతోషం గా ఉండడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు చెబుతున్నారు. అంతేకాకుండా ఏడాది ప్రారంభంలో ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా సంతోషంగా జీవించగలుగుతారని చెబుతుంటారు. నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కోరకంగా పూజలు చేస్తూ దేవుని కొరవడం వల్ల మనిషిలో ఉన్న ఆటంకాలు చెడు గుణాలు మాయమవుతాయని… దీంతో నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉండి పాజిటివ్ ఎనర్జీని పొందుతారని పండితులు చెబుతున్నారు. అయితే వసంత నవరాత్రుల్లో పాల్గొనేవారు నిష్టతో ఉండాలి. సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణంలో మెదలాలి. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు ఉన్నందున.. సాంప్రదాయ ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. ఇలా ఆహారం తీసుకోవడం వల్ల ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. అందువల్ల ఈ వసంత నవరాత్రులకు ప్రత్యేకత వచ్చిందని పండితులు చెబుతున్నారు.
Also Read : పొలిటికల్ పంచాంగ శ్రవణాలు.. ఎవరి డప్పు వారిదే!