The Family Man in OTT : ఓటీటీలోకి వచ్చి మంచి వ్యూస్ సంపాదించిన వెబ్‌సిరీస్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. ఇది మొదటిసారి 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి వచ్చింది. మొదటి సీజన్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టి రికార్డులను సృష్టించింది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ ఏడాదే ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ రాబోతుంది. ఇందులో లీడ్ రోల్ పోషించిన మనోజ్ బాజ్‌పాయీ ది ఫ్యామిలీ మ్యాన్‌పై అప్డేట్ ఇచ్చాడు.
Also Read : జలియన్వాలా బాగ్ దారుణం.. 106 ఏళ్ల తర్వాత క్షమాపణ డిమాండ్
ఇటీవల జరిగిన ఓటీటీప్లే అవార్డుల కార్యక్రమంలో మనోజ్ బాజ్‌పాయి ఈ సిరీస్‌పై అప్డేట్ ఇచ్చాడు. ఈ ఏడాది నవంబర్‌లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ది ఫ్యామిలీ మ్యా్న్ సిరీస్ రాబోతున్నట్లు తెలిపాడు. అయితే ఈ సిరీస్‌లో శ్రీకాంత్ తివారీ అనే స్పై పాత్రలో నటించాడు. మూడో సీజన్ ఎప్పుడు వస్తుందని అడగడంతో ఈ ఏడాది వస్తుందని తెలిపాడు. అయితే ఈసారి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో కొత్త పాత్ర కూడా వస్తుందట. ఈ కొత్త పాత్రను తీసుకోవాలని రెండేళ్ల కిందటే నిర్ణయించారట. కొత్త పాత్రలో జైదీప్ అహ్లావత్‌ను తీసుకోవాలని ముందు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ఇతను పాతాళ్ లోక్ సీజన్ 2లో బాగా నటించాడు. ఈ క్రమంలోనే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త సీజన్ మిగతా సీజన్ల కంటే బాగుంటుందని, అద్భుతంగా ఉంటుందని తెలిపాడు.
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ బాగా ఫేమస్. ఈ సిరీస్‌కి ఓటీటీలో ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఓటీటీని ఈ సిరీస్ హల్‌చల్ చేసింది. అయితే మొదటి సీజన్ 2019లో వచ్చింది. ఈ సిరీస్ మొత్తం కశ్మీర్ ఉగ్రవాదం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చింది. దీన్ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేశారు. మొదటి సీజన్ తీసిన వెంటనే ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మళ్లీ రెండో సీజన్‌ను కూడా తీశారు. మొదటి సీజన్ వచ్చిన రెండేళ్ల తర్వాత 2021లో రెండో సీజన్ వచ్చింది. రెండో సీజన్‌లో శ్రీలంక ఎల్టీటీఈ ఉగ్రవాదంపై సిరీస్ తీశారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ కనిపించాడు. ఈ రెండో సీజన్‌లో సమంత నెగటివ్ రోల్‌లో నటించింది. అయితే మొదటి సీజన్ అంతా అయితే ఈ సీజన్‌కు రెస్పాన్స్ రాలేదు. అయితే వరుస రెండు సీజన్లు హిట్ కావడంతో మూడో సీజన్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్లు అయినా కూడా ఈ సీజన్ ఇంకా రాలేదు. మొత్తానికి ఈ ఏడాది నవంబర్‌లో మూడో సీజన్ రానుంది.
Also Read : ‘చిరు నవ్వుల పండుగ’.. ఓ భార్యాభర్తల కథ.. అనిల్ రావిపూడి ప్లానింగ్ అదుర్స్!