https://oktelugu.com/

Star Heroine: సినిమాల్లో చాలా పద్ధతిగా.. కానీ నెట్టింట మాత్రం గ్లామర్ షో తో రచ్చ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా..

Star Heroine సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి రోజు కూడా ఏదో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు కానీ రేర్ ఫోటోలు కానీ కనిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు చాలామంది హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు అందరిని బాగా ఆకట్టుకున్నాయి.

Written By: , Updated On : March 30, 2025 / 01:54 PM IST
Star Heroine (4)

Star Heroine (4)

Follow us on

Star Heroine: సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్న టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరో హీరోయిన్ల త్రో బ్యాక్ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన స్కూల్ డేస్ ఫోటో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఈమె టాప్ హీరోయిన్. స్టార్ హీరోలకు జోడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టు కూడా అందుకుంది. అయితే పెళ్లి చేసుకొని చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా ఈ చిన్నది ఇప్పుడిప్పుడే తన సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేసింది. తెలుగుతోపాటు తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ స్కూల్ డేస్ ఫోటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఆమె తన నటనతో, అందంతో బాగా ఫేమస్ అయ్యింది. విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తన ట్రెడిషనల్ లుక్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

ఈమె మరెవరో కాదు ఒకప్పటి టాలీవుడ్ తెలుగు క్రేజీ హీరోయిన్ మీరా జాస్మిన్. అప్పట్లో మీరాజాస్మిన్ కుర్రాళ్ళ మనసును దోచేసింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డం సంపాదించుకున్న తక్కువ హీరోయిన్లలో మీరాజాస్మిన్ కూడా ఒకరు. ఈమె తెలుగుతోపాటు తమిళ్ భాషలలో కూడా అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమాలో మీరాజాస్మిన్ హీరోయిన్గా కనిపించింది. భద్ర సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే మీరాజాస్మిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడిగా గుడుంబా శంకర్ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటున్న మీరాజాస్మిన్ లేటెస్ట్గా సినిమాల్లోకి రిఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయి గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. అప్పట్లో సినిమాల్లో నటించే సమయంలో స్కిన్ షోకు నో చెప్పిన మీరాజాస్మిన్ ఇప్పుడు మాత్రం ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతి పోగోడుతుంది. ప్రస్తుతం మీరాజాస్మిన్ స్కూల్ డేస్ రేర్ ఫోటో సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటుంది.