Ugadi 2025 (2)
Ugadi 2025: తెలుగు వారికి కొత్త సంవత్సరం అయిన ఉగాది పండును ఈ ఏడాది మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. కొత్త సంవత్సరం నాడు కొత్త దుస్తులు ధరించి, రకరకాల వంటలు తయారు చేసి సంతోషంగా జరుపుకుంటారు. ప్రతీ ఏడాది ఉగాది పండుగను చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటారు. అయితే ఉగాది రోజు ఉదయాన్నే లేచి కొత్త దుస్తులు ధరించి పూజలు నిర్వహిస్తారు. ఉగాది పండుగ నాడు కుటుంబ సభ్యులు, స్నేహితులకు విషెష్ తెలియజేస్తారు. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది శుభాకాంక్షలను ఇలా చెప్పేయండి.
ఈ కొత్త సంవత్సరం మీకు ఆనందాలు, సుఖాలు తీసుకురావాలని కోరుకుంటూ.. మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
కొత్త ప్రారంభాలతో పాటు అవకాశాలు కూడా వచ్చి ఈ ఉగాది పండగను మీరు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. ఉగాది పండుగ శుభాకాంక్షలు
ఈ ఉగాది మీకు విజయాన్ని, ఆనందాన్ని, శ్రేయస్సును అందించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
కొత్త ఏడాదిలో అద్భుతమైన కొత్త ప్రయాణాలకు నాంది పలకాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు
తెలుగువారి నూతన సంవత్సరం మీకు ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
కొత్త ఆశలతో ఈ ఉగాదిని ఆనందంగా ప్రారంభించాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు
ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగి.. సంతోషంగా ఈ ఏడాది ఉండాలని కోరుకుంటూ.. ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఈ ఏడాది అయినా మీరు అనుకున్నవి అన్ని జరగాలని కోరుకుంటూ.. హ్యాపీ ఉగాది
మీరు అనుకున్న లక్ష్యాలను ఈ ఏడాది అయినా ఛేదించాలని ఆశిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
ఈ ఉగాదితో అయినా మీ జీవితం సంతోషంగా నవ్వులతో నిండిపోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
గతాన్ని వదిలేసి సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు
మిమ్మల్ని మీరు నమ్ముతూ.. ఏడాదిని విజయం వైపు తీసుకెళ్లాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు
కొత్త ఏడాదిలో అన్ని కూడా సరికొత్తగా ప్రారంభించాలని కోరుకుంటూ.. హ్యాపీ ఉగాది
అందరిపై ప్రేమ చూపిస్తూ.. గౌరవిస్తూ ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ ఉగాది
ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు
ఈ ఏడాది మీకు సుఖం, శాంతి, సంపద కలగాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు
జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనే స్తోమత మీకు కలగాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు
మీరు కోరుకున్న కలలు అన్ని కూడా ఈ ఏడాది నెరవేరాలని కోరుకుంటూ.. హ్యాపీ ఉగాది
కోపాన్ని, ఉక్రోశాన్ని పక్కన పెట్టి ఈ ఏడాది సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ ఉగాది.