spot_img
Homeఆధ్యాత్మికంHoroscope - Rashiphalalu : ఈ రాశి వారికి ప్రత్యర్థులతో ముప్పు

Horoscope – Rashiphalalu : ఈ రాశి వారికి ప్రత్యర్థులతో ముప్పు

Horoscope – Rashiphalalu : మకర సంక్రాంతి తరువాత కొందరి జీవితాల్లో అనేక మార్పులు రానున్నాయి. చంద్రుడు మేషరాశిలో సంచరించడం వల్ల జనవరి 18న గురువారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం నుంచి మీనం రాశివరకు కొందరిలో ఆకస్మిక అదృష్టం వరించనుంది. ఓ రాశివారికి ప్రత్యర్థులతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
వ్యాపారస్తులు కొన్ని ప్రణాళికలు వేస్తారు. ఆ తరువాత వీటిని వాయిదా వేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావొచ్చు.

వృషభం:
ఉద్యోగులకు అనుకూల వాతావరణం. కొందరికి ప్రమోషన్ కూడా రావొచ్చు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లదంగా ఉంటుంది.

మిథునం:
వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత అవసరాలకు ఖర్చులు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. టూర్ కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

కర్కాటకం:
ఉద్యోగులకు ఈరోజు కష్టంగా గడుస్తుంది. ఎంత శ్రమ పడినా బాస్ నుంచి సపోర్టు ఉండదు. కుటుంబంలోనూ కలహాలు ఏర్పడుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.

సింహ:
డబ్బు కోసం ఇతరులను సంప్రదిస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశం. కొన్ని విషయాల్లో నిరుత్సాహంగా ఉంటారు.

కన్య:
కుటుంబ విషయంలో ఆందోళనగా ఉంటారు. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల:
గతంలో మొదలుపెట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ అవసరాల కోసం డబ్బును ఖర్చు చేస్తారు. వ్యాపారులు చాకచక్యంగా ఆదాయాన్ని సమకూరుస్తారు.

వృశ్చికం:
ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యక్తిగతంగా డబ్బు చిక్కులు ఏర్పడుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇతరులను సంప్రదించాలి.

ధనస్సు:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ శ్రేయస్సు కోసం తాపత్రయపడుతారు. వ్యాపారులకు అనుకూలం.

మకర:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కెరీర్ గురించి ఆందోళన వద్దు. అవగాహనతో ముందుకు సాగితే ఫలితం ఉంటుంది.

కుంభం:
ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు తోటివారి మద్దతు ఉంటుంది. భావోద్వేగాలకు గురికాకుండా ఉండాలి. భవిష్యత్ లో చేపట్టబోయే పనులకు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తారు.

మీనం:
ఉద్యోగులు చాకచక్యంగా వ్యవహరించాలి. లేదంటే ప్రత్యర్థులతో ముప్పు ఏర్పడే అవకాశం. కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. వ్యాపారులు కొన్ని విషయాల్లోజాగ్రత్తగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version