Gold Silver Prices : బంగారం ధరలు మరోసారి తగ్గాయి. వెండి ధరలు కూడా అదేస్థాయిలో తగ్గుతుండడం విశేషం.బంగారం కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని అంటున్నారు. దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 18న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,950 గా ఉంది. జనవరి 17న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,050తో విక్రయించారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు రూ.350 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,100గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,950 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,100 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,380తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,900గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం వెండి రూ.600 మేర తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,900గా ఉంది. ముంబైలో రూ.75,900, చెన్నైలో రూ.77,400, బెంగుళూరులో 73,750, హైదరాబాద్ లో రూ.77,400తో విక్రయిస్తున్నారు.