Homeఆధ్యాత్మికంToday 30 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈ రోజు అనుకోని...

Today 30 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈ రోజు అనుకోని అదృష్టం..

Today 30 May 2026 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారు కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి పెద్దల సలహా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు గతంలో చేపట్టిన పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గణనీయంగా పెరిగినా.. ఖర్చులు ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అనుకోకుండా ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు అధికంగా ఉంటాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇలాంటి సమయంలో వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తే వాటి వల్ల లాభాలు ఉంటాయి. వ్యాపారులకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఉద్యోగులు తోటి వారి సహాయంతో మిగిలిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగానికి గురవుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిని పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకుంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలు ఉంటాయి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగులకు సానుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మికంగా లాభాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రయాణాలు కలిసి వస్తాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికపరంగా అన్ని విజయాలు సాధిస్తారు. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణఉండడంతో ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. పెండింగ్ పనులు అన్ని పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular