Homeఆధ్యాత్మికంToday 24 December 2025 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు ధనయోగం..

Today 24 December 2025 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు ధనయోగం..

Today 24 December 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. నీతో కొన్ని రాశుల వారికి ధనయోగం ఏర్పడనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు చేసే ప్రతి పనిలో లాభాలు పొందుతారు. అనుకున్న పనులను పూర్తి చేయడంతో ఉద్యోగులు […]

Today 24 December 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. నీతో కొన్ని రాశుల వారికి ధనయోగం ఏర్పడనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు చేసే ప్రతి పనిలో లాభాలు పొందుతారు. అనుకున్న పనులను పూర్తి చేయడంతో ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. జీవిత భాగస్వామి మద్దతుతో అప్పులను తీరుస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు రోజంతా ఉత్సాహంగా పనిచేస్తారు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారికి ఈరోజు అధికమైన లాభాలు ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు ఈరోజు భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ ప్రారంభానికి సన్నాహాలు చేస్తారు. పిల్లలతో సరదాగా గడుపుతారు. స్నేహితులతో కలిసి సరదాగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో సంతోషంగా గడుపుతారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు బాధ్యతాయుతంగా పూర్తిచేస్తేనే అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కార్యాలయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొందరు పక్కన ఉండే చీట్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ప్రణాళిక ప్రకారంగా పరులని పూర్తి చేయగలుగుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈరోజు వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు రానున్నాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు గతంలో కంటే లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారుల సమస్యలను ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అయితే కొత్తవారితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. కుటుంబంలో కొందరు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. పూర్వికుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబంతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సోదరులతో కలిసి కొత్తగా పెట్టుబడులు పెడతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్త్రాన్ని కొనుగోలు చేస్తారు. గతంలో పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. పర్యటనలు చేసే వారికి ప్రయోజనాలు అందుతాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడితే వెంటనే పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. విద్యార్థులకు గురువుల నుంచి సంపూర్ణ పద్ధతి ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా సంతృప్తిగా ఉంటారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించాలి. పోటీ పరీక్షలో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తారు. వీరికి తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కష్టమైన పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. తోటి వారి సహాయంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు అనేక లాభాలే ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper