Today 21 August 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. దీంతో ఆయా రాశుల వారికి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. గురువారం మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు ప్రాధాన్యత పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు కాస్త శ్రమ పడితే ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబ వ్యవహారాలను చక్కబడతాయి. దీంతో ఉల్లాసంగా గడుపుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : గతంలో చేపట్టిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్తపెట్టబడులు పెడతారు. వీరికి కొత్త భాగస్వాములు చేరుతారు. అయితే వీరితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా వెల్లడించవద్దు. ఉద్యోగులకు అనుకున్న ఆదాయం లభిస్తుంది. అదరపు ఆదాయం కోసం ప్రయత్నించేవారు శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి శుభవార్తలు పొందుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించబడుతాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అయితే వీరిలో ఒకరితో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారులు తోటి భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తే జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనే అవకాశం ఉంటుంది. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. తల్లిదండ్రులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. కొందరు వీరి దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వడానికి చాలా వెనుకడుగు వేస్తారు. ఎవరికి కొత్త హామీలు ఇవ్వకుండా ఉండాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే తోటి వారి సహాయంతో సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు స్వర్ణ దినం అని చెప్పవచ్చు. ఎందుకంటే వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . మీ రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. ఆదాయం పెరుగుతున్నా ఖర్చు విపరీతంగా ఉంటాయి. అయితే దుబార ఖర్చుల విషయంలో ఆలోచించాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అర్హులైన వారికి వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ప్రోత్సాహకర బహుమతులు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇతర ప్రదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో సందడిగా మారుతుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఒత్తిడిని ఎదుర్కొంటారు. గతంలో చేపట్టిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయం ఏర్పడడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. తోటి వారి సహాయంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. అయితే అధికారుల నుంచి కాస్త సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసే వారికి అధిక లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. వ్యాపారులకు నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. నీతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ జీవితం అనుకున్న విధంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేసేటప్పుడు రహస్యాలు ఇతరులకు చెప్పకుండా ఉండాలి. జీవితం భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ద్వార ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు అదనపు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు తమ ముఖ్యమైన కార్యకలాపాలపై శ్రద్ధ వహించాలి. కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.