War 2 Movie Box Office Collection: ఎన్టీఆర్(Junior NTR),హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. తెలుగు లోనే కాదు, హిందీ లో కూడా ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. స్పై యూనివర్స్ లో ఇప్పటి వరకు విడుదలైన అన్ని సినిమాలకంటే ఈ చిత్రానికే తక్కువ వసూళ్లు వచ్చాయి. తెలుగు లో అయితే అసలు థియేట్రికల్ షేర్ వసూళ్లు ప్రాంతాల వారీగా రావడం ఆగిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమాకు ఇలా జరగడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. విడుదలై వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా చూద్దాం. తెలుగు వెర్షన్ వసూళ్లు ఆగిపోయినప్పటికీ హిందీ నుండి మాత్రం ఎంతో కొంత వస్తూనే ఉన్నాయి.
Also Read: ‘అగ్నిపరీక్ష’ షోలో అభిజిత్ పై సంచలన ఆరోపణలు చేసిన కంటెస్టెంట్..వీడియో వైరల్!
ఆరవ రోజు ఇండియా లో ఉండే PVR మల్టీప్లెక్స్ చైన్స్ లో టికెట్ రేట్స్ పై ఆఫర్లు ఉండడం తో 5వ రోజు కంటే కాస్త ఎక్కువ వసూళ్లు వచ్చాయి. కానీ 7 వ రోజు మళ్ళీ 40 శాతం డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి మొదటి వారం లో 37 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ థియేట్రికల్ షేర్ దాదాపుగా 42 కోట్ల రూపాయిల వరకు తెలుగు వెర్షన్ షేర్ వసూళ్లు ఉంటాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక లో 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, తమిళ నాడు + కేరళ కలిపి 2 కోట్ల 65 లక్షలు, హిందీ వెర్షన్ లో 69 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో హిందీ + తెలుగు వెర్షన్ కలిపి 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా మొదటి వారం ఈ చిత్రానికి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 150 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 54 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అదే విధంగా ఓవరాల్ గా హిందీ వెర్షన్ కూడా కలిపి దాదాపుగా 160 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది అసాధ్యం. కనీసం 140 కోట్ల రూపాయిల నష్టం తో నిర్మాతలు కంటతడి మిగిలించింది ఈ చిత్రం. స్టార్ క్యాస్ట్ మీద పెట్టిన శ్రద్ద ఎదో కంటెంట్ మీద పెట్టి ఉండుంటే ఫలితం ఇలాంటివి వచ్చేది కాదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.