Homeఆధ్యాత్మికంToday 18 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై ఈరోజు శని...

Today 18 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై ఈరోజు శని దేవుడి ప్రభావం.. ఏం జరగనుంది అంటే..

Today 18 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారిపై శని దేవుడి ప్రభావం వల్ల అన్ని విజయాలే ఉంటాయి. మరికొన్ని రాశుల వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి ఉద్యోగులు ఈ రోజు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. కొత్త విషయాలను నేర్చుకునేందుకు విద్యార్థులు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు అధిక లాభాలు పొందడంతో మానసికంగా సంతోషంగా ఉంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చులను అధికంగా పెట్టే అవకాశం ఉంది. అందువల్ల వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయం అనుకూలంగా ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. కొందరికి శని దేవుడి అనుగ్రహంతో ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేరేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక భద్రత కోసం కొన్ని చర్యలు తీసుకుంటారు. ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు రిలీజ్ అవుతుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో అనేకమార్పులు ఉంటాయి ఇలాంటి సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు తోటి వారి సహాయంతో ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారు. చాలా సమస్యలకు ఈరోజు పరిష్కారం ఏర్పడుతుంది. పాత సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన ఫలితాలను పొందనున్నారు. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఉన్నతాధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు పెట్టే పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. అనవసరపు వివాదాల్లోకి తలదురుచకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితుల నుంచి ధన సహాయం పొందుతారు. కుటుంబ జీతం సంతోషంగా ఉంటుంది. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన రిస్కులకు దూరంగా ఉండటమే మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రాజెక్టుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కీలకమైన బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు. వ్యాపారులు భాగస్వాముల విషయంలో రహస్యాలు బయట పెట్టకూడదు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. ఉద్యోగులు తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సీనియర్ల సహకారం తీసుకుంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు పాత వివాదాల నుంచి బయటపడతారు. కొత్త విషయాలను నేర్చుకునేందుకు గురువుల మద్దతు ఉంటుంది. వీరికి శని దేవుడి ఆశీస్సులు ఉండడంతో అన్ని అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular