Today 16 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశరాసులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు కొత్తగా పెట్టుబడును పెడతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి ఆదాయం ఈరోజు గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగులకు బదిలీలు ఉండే అవకాశం ఉంది. ప్రమోషన్ గురించి శుభవార్తను వింటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పెద్దల ఆరోగ్యం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెడతారు. ఉద్యోగులు మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నింటిలో విజయం సాధిస్తారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. జీవితం భాగస్వామి అండదండలతో ఆర్థికంగా స్థిరపడతారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కొందరు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇంట్లోని రహస్యాలను ఎవరికి చెప్పుకోకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. అనుకోకుండా జరిగే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు గ్రహాల అనుకూలత ఉండడంతో చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహరాశి వారికి ఈరోజు అపాలమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. అనుకున్న ప్రతి పనిని పూర్తి చేస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు సంతోషకరమైన వాతావరణ ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడి పెడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతారు. గ్రహాల అనుకూలతతో సమస్యలు తొలగిపోతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులు పెద్దలను సంప్రదించడం మంచిది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారాలు అధిక లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువగా డబ్బు వస్తువులు అవుతుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. పాత అప్లోడ్ నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పడుకోకుండా వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
