Homeఅంతర్జాతీయంTrump Iran Deal: యుద్ధం ముగిసింది.. ఇరాన్ ముందు అమెరికా మోకరిల్లింది.. ట్రంపూ నువ్వు జబ్బలు...

Trump Iran Deal: యుద్ధం ముగిసింది.. ఇరాన్ ముందు అమెరికా మోకరిల్లింది.. ట్రంపూ నువ్వు జబ్బలు చరచుకో ఇక

Trump Iran Deal: యుద్ధం వల్ల ఏం జరిగింది.. ఇజ్రాయిల్ దేశానికి సంఘీభావంగా వచ్చిన అమెరికా.. ఏం సాధించింది.. ఇప్పుడు డీల్ కుదుర్చుకొని అమెరికా ఏం లాభం పొందింది.. ఇప్పుడు ఈ ప్రశ్నలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. తన జన్మదినం సందర్భంగా ట్రంప్ గొప్పగా చెప్పుకోవచ్చు.. తాను ఇతర అమెరికా అధ్యక్షుల వలె కాకుండా
.. ఇరాన్ దేశంతో యుద్ధాన్ని ముగించానని… మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పానని జబ్బలు చర్చుకోవచ్చు. కానీ అమెరికా కోరుకున్నట్టుగా.. అమెరికా ఆశించినట్టుగా అక్కడ జరగలేదు.

అమెరికా చేసిన యుద్ధం వల్ల ఇరాన్ భారీగా నష్టపోయింది. నగరాలకు నగరాలు తుడిచిపెట్టుకొని పోయాయి. సైన్యం మొత్తం నాశనమైంది. వేలాదిగా ప్రజలు చనిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ఇరాన్ ఇప్పుడు స్మశానంతో సమానం. ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ ఇరాన్ వెన్ను వంచలేదు. మడమ తిప్పలేదు. పోరాటం చేస్తూనే ఉంది. తనకు నచ్చిన తీరుగా వ్యాపారం చేస్తూనే సాగిపోయింది. కొన్ని సందర్భాలలో బ్లాక్ మార్కెట్ ద్వారా కూడా చమురు తరలించింది. అమెరికా కన్నుగప్పి వ్యాపారాన్ని సాగించింది. ఇరాన్ ఏ దేశానికి చమురు అమ్మింది.. ఎక్కడి నుంచి మనీ ల్యాండరింగ్ ద్వారా డబ్బు స్వీకరించింది అనే విషయాలు ఇప్పటికీ బయటకి తెలియ రాలేదు. అంతటి అమెరికా సిఐఏ ఏజెన్సీ ఉన్నప్పటికీ ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయింది.

14 సూత్రాల ఒప్పందానికి ఒకవేళ అమెరికా గనుక కట్టుబడి ఉంటే ఇరాన్ నైతికంగా గెలిచినట్టే. ఎందుకంటే ఆ 14 సూత్రాలు అమెరికా పాటిస్తే ఇరాన్ ఫ్రీ అయిపోతుంది. ప్రపంచ దేశాలు అన్నింటికీ చమురు అమ్ముకోవచ్చు. అంతేకాదు, దర్జాగా వ్యాపారం సాగించుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద పట్టు సాధించవచ్చు. అమెరికా సేనలు ఇరాన్ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే అక్కడి ప్రజలు స్వేచ్ఛగా బతకవచ్చు. ఇంతే కాదు .. చమురు విషయంలో ధరను కూడా నిర్ణయించుకోవచ్చు. 14 సూత్రాలకు అమెరికా ఒప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేసే స్థాయి అమెరికా సైన్యానికి లేదు. ఎందుకంటే అమెరికా సైన్యం మీద ఇప్పటికే భారీగా ఖర్చుపెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే ఇజ్రాయిల్ కోసం అమెరికా తన డబ్బులు మొత్తం యుద్ధానికి తగలేసింది. ఇలాగే చేసుకుంటూ పోతే అమెరికా తీవ్రంగా నష్టపోతుంది. అందువల్లే పదేపదే ట్రంప్ డీల్ అంటూ మాట్లాడాడు..

ఇరాన్ ఎప్పటిలాగే తన ధైర్యాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉంది. 14 సూత్రాల ఒప్పందానికి అమెరికానే కట్టుబడి ఉండాలంటూ ఉల్టా ప్రశ్నిస్తోంది. ఇప్పుడు అమెరికాకు మరో మార్గం లేదు. నిన్నటిదాకా ఇరాన్ మీద మీసాలు దువ్వింది. ఇప్పుడేమో డీల్ కుదిరింది.. యుద్ధం ముగిసింది అంటూ మాట్లాడుతోంది.. పాపం ట్రంప్.. గాలికి పోయే కంపను తగిలించుకున్నాడు. ఇప్పుడు ముండ్లు ఏరుకునే పనిలో పడ్డాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version