Lord Shiva : భోళా శంకరుడు.. లయ కారకుడు అయిన శివనామస్మరణ ఎంతో మధురమైనది. సర్వేశ్వరుడి అనుగ్రహం పొందాలని చాలా మంది తపన పడుతూ ఉంటారు. ఇందుకోసం వివిధ పూజలు, వ్రతాలు చేస్తుంటారు. శివయ్యకు సోమవారం ప్రతీకరమైనది. ఈరోజున శివుడికి కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం పొందవచ్చని కొందరు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ప్రతీ సోమవారం శంకరుడికి కొన్ని పత్రాలు, పుష్పాలతోపాటు కొన్ని రకాల అభిషేకాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. అవేంటంటే?
పరమేశ్వుడిన ప్రసన్నం చేసుకోవాలంటే ఆషామాషీ కాదు. ఆయన అనుగ్రహం పొందాలంటే ఎంతో భక్తితో కొన్ని పనలు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా శివుడు ఆడంబరాలు కోరుకోడు. ఎలాంటి పూజ అయినా భక్తితో చేయడం వల్ల వెంటనే భక్తుల కోరికలు నెరవేర్చడానికి ముందుంటాడు. సాధారణ రోజుల్లో కంటే మహా శివరాత్రి, ప్రతీ సోమవారం శివయ్యకు ఇష్టమైన కొన్ని పనులు చేయడం వల్ల సుఖ సంతోషాలతో ఉంటారు.
శివుడు అభిషేక ప్రియుడు అయనకు అభిషేకం అంటే చాలా ఇష్టం. అభిషేకం అనగానే ఎంతో ఖర్చుతో కూడుకున్న పరమాన్నాలు కోరడు. జలాభిషేకం చేసినా శివుడు అనుగ్రహిస్తాడు. అయితే కాస్త చొరవ తీసుకొని శివయ్యకు పాలాభిషేకం చేయడం వల్ల ఎంతో మంచిది. ఈ అభిషేకం చేసే సమయంలో శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను మరిచిపోవద్దు. బిల్వపత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే శివుని దయ ఉంటుందని అంటారు.
అయితే ఈ పూజలు చేసేందుకు శివాలయంలోకి కొన్ని పద్దతుల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. శివాలయాల్లోకి వెళ్లేటప్పుడు పంచె ధరించాలి. ఇది తెల్లనిదై ఉండాలి. కొన్ని ఆలయాల్లో షర్ట్ విప్పాల్సి ఉంటుంది. శివాలయానికి వెళ్లేటప్పుడు మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రానీకుండా ఉండాలి. ముఖ్యంగా కుటుంబంతో వెళ్లేటప్పుడు సంతోషంగా శివుడికి అభిషేకం చేయాలి. దీంతో ఆ కుటుంబం సంతోషంగా ఉండడానికి శివుడు సహకరిస్తాడు.