Akshaya Tritiya : ప్రతీ ఏడాది అక్షయ తృతీయ వస్తుందంటే కొందరు మహళల్లో ఏదో తెలియని సంతోషం. ఈరోజున ఎంతో కొంత పసిడిని కొనుగోలు చేయొచ్చనే ఆలోచనలో ఉంటారు. ఈరోజున పిసిరంత బంగారం కొన్నా.. లక్ష్మీ దేవత ఇంట్లో అడుగుపెట్టినట్లేనని కొందరు భావిస్తారు. 2024 ఏడాదిలో మే 10న అక్షయ తృతీయ రానుంది. ఈ సందర్భంగా కొందరు బంగారం కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం మాత్రమే కాకుండా వెండి కొన్నా మంచే జరుగుతుందని కొందరు చెబుతున్నారు. అలా ఎలాగంటే.
అక్షయ తృతీయ ప్రత్యేకంగా పండుగ కాకున్నా.. ఈరోజు ప్రత్యేకంగా మహాలక్ష్మీ దేవతకు పూజలు నిర్వహస్తారు. ఈరోజు లక్ష్మీ దేవత కొలువై ఉన్న బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. అయితే బంగారం మాత్రమే కాకుండా వెండికి సంబంధించిన ఏ వస్తువు కొన్నా లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని కొందరు అంటున్నారు. 2024 మే 10న ఉదయం 10.45 గంటలకు రోహిణి నక్షత్రం ఉండనుంది. ఈ సమయంలో బంగారం లేదా వెండి వస్తువులు కొనుగోలు చేసి ఇంట్లోకి తెచ్చుకోవాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ఆ సమయానికి బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని అంటున్నారు. అయితే ఇవే కాకుండా ఇల్లు, భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసినా ఇంటికి శుభం జరగనుంది. ఎలాంటి వస్తువులు కొన్నా వాటిపై ధనాకర్షణ ఉంటుంది. ఆ వస్తువుల వల్ల తదుపరి కాలంలో అంతా మంచే జరగుతుందని అర్థం. ఇక ఏ వస్తువులు కొనుగోలు చేయలేని వారు ఇతరులకు ఆహార దానం చేసినా ఫున్యఫలం వస్తుందని అంటున్నారు.