https://oktelugu.com/

Tirumala Srivaru : తిరుమల శ్రీవారి గొప్పతనం అంటే అదే.. ఎంతటి గురువులైనా రావాల్సిందే..

గురు శరణానంద్ స్వామి తిరుమలకు రావడంతో మరోసారి శ్రీవారి గొప్పతనం ఏంటో తెలిసిపోయింది. ఎంతటి విలువైన దయా భక్తి, ఆధ్యాత్మిక విలువలు ఉన్న స్వామిజీలు సైతం తిరుమల శ్రీవారిని దర్శించుకోక తప్పదని ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. అయితే గురు శరణానంద్ స్వామి తిరుమలకు రావడం వెనుక ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 13, 2024 / 02:13 PM IST

    Guru sharananand

    Follow us on

    Tirumala Srivaru : భారతదేశం ఆధ్యాత్మిక వాతావరణానికి నిలయం అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రాచీన కాలం నుంచే దేవాలయాలు నిర్మిస్తున్నారు. కొందరు వాటిని తరతరాల ఆస్తిగా భావిస్తూ వస్తున్నారు. మరికొందరు కొత్తవాటిని నిర్మిస్తున్నారు. దేవాలయాలు నిర్మించి, దేవుళ్లకు పూజలు చేయడమే కాకుండా కొందరు స్వామిజీల పట్ల భక్తితో ఉంటారు. సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక మనిషి ఎలా జీవించాలి? తాను ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా మెలగాలి? అనే విషయాలను ఎంతో మేథా సంపత్తి కలిగిన స్వామిజీలు ప్రవచనలు చేస్తుంటారు. వీరు చెప్పిన ఆధారంగా కొందరు తమ జీవితాన్ని సార్థం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిలో గురునానంద్ జీ మహరాజ్ స్వామిజీ ఒకరు. దేశంలో ప్రముఖ స్వామీజీగా పేరున్న ఈయన ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాక్షాత్తూ ఆ శ్రీవారి పిలువు వచ్చినందునే ఆ స్వామి తిరుమలకు వచ్చారని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి చర్చించుకోవడం ప్రారంభించారు. ఇంతకు ఆ స్వామి ఎలా ప్రముఖుడయ్యారు?

    అజ్ఞానులైన మనుషులను సక్రమ మార్గంలో నడిపించడానికి కొందరు తమ జీవితాలను త్యాగాలు చేస్తుంటారు. మంచి మంచి విషయాలు చెబుతూ జ్ఞానాన్ని బోధిస్తారు. శరీర సంబంధాల సుఖాలు, ప్రాపంచిక ఆనందాలు మరిచి వీరు స్వామిజీగా అవతరిస్తారు. మనుషులను శాశ్వతమైన సత్యంలోకి తీర్చాలని అనుకున్న గురు శరణానంద్ మహరాజ్ ప్రజలకు విలువైన బోధనలు చేస్తున్నారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన ఆధ్యాత్మిక బోధనలు చేస్తుంటారు. ఇవి ముఖ్యంగా మనిషీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు వాటి పరిష్కారించే విధంగా ఉంటాయి. అలాగే క్రోధ మనసుతో నిండిన వారిని సన్మార్గంలో మార్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.

    సర్ శబ్ధ్ మిషన్ కు చెందిన ఐదవ గురువు అయిన గురు శరణానంద్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయన గొప్పతనం తెలుసుకున్న దలైలామా వంటి వారు అతనితో స్నేహం చేశారు. దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం గురు శరణానంద్ స్వామి ని కలుసుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా శిష్యుల బందో బస్తు, హంగు ఆర్భాటాల కోలాహాలం ఉంటుంది. ఆయన చేత ప్రవచనాలు ఇప్పించుకునేందుకు కొందరు ప్రత్యేక ఆహ్వానం పలుకుతారు.

    అలాంటి స్వామి ఇటీవల ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ఎలాంటి సమాచారం లేకుండా, బందోబస్తు కానకుండా స్వామి వారిని దర్శించుకున్నారు. శిష్యులకు సైతం తెలియకుండా ఆయన ఇటీవల తిరుమలను సందర్శించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సర్ శబ్ధ్ మిషన్ ను విడిచిన తరువాత ఆయన శిష్యులు ఆందోళన చెందారు. ఆయన కోసం వెతికారు. కానీ ఆయన తిరుమలకు రావడం ఆసక్తిగా మారింది.

    గురు శరణానంద్ స్వామి తిరుమలకు రావడంతో మరోసారి శ్రీవారి గొప్పతనం ఏంటో తెలిసిపోయింది. ఎంతటి విలువైన దయా భక్తి, ఆధ్యాత్మిక విలువలు ఉన్న స్వామిజీలు సైతం తిరుమల శ్రీవారిని దర్శించుకోక తప్పదని ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. అయితే గురు శరణానంద్ స్వామి తిరుమలకు రావడం వెనుక ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆ వేంకటేశ్వరుడిని నుంచి గురు శరణానంద్ స్వామిజికి పిలుపు వచ్చిందని, అందుకే శ్రీవారి దర్శనానికి అయన ఉన్న ఫలంగా వచ్చారని అనుకుంటున్నారు.