Homeఅంతర్జాతీయంMiddle East War Impact On Dubai Economy: మిడిల్ ఈస్ట్ యుద్ధం.. దుబాయ్ పని...

Middle East War Impact On Dubai Economy: మిడిల్ ఈస్ట్ యుద్ధం.. దుబాయ్ పని అయిపోయినట్టేనా?

Middle East War Impact On Dubai Economy: విలాసవంతమైన రోడ్లు.. అత్యాధునికమైన విమానాశ్రయాలు.. ఆకాశాన్ని తాకే హోటల్లు.. అంతకుమించి అనే స్థాయిలో నౌకాశ్రయాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే దుబాయ్ ప్రస్థానం వర్ణనకు అందదు. ప్రపంచ వాణిజ్య నగరిగా.. పెట్టుబడుల గమ్యస్థానంగా పేరు తెచ్చుకున్న దుబాయ్.. ఇప్పుడు తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది.

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు.. ప్రపంచ వ్యాప్తంగా విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడినప్పుడు.. పెట్టుబడిదారులంతా దుబాయ్ వైపు చూశారు. ఫలితంగా దుబాయ్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక స్థాయికి చేరుకుంది. వాస్తవానికి 1980లో 10 లక్షలు గా ఉన్న దుబాయ్ జనాభా 2024 నాటికి 1.1 కోట్లకు చేరుకుంది. బీ రూట్, బహ్రెయిన్ ప్రాంతాలు తమ ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోయిన తర్వాత.. దుబాయ్ అనేది పెట్టుబడిదారులకు ఒక స్థిరమైన గమ్యస్థానం లాగా మారింది. దీనికి తోడు దుబాయ్ నగరంలో పెట్టు బడులు విశేషంగా రావడంతో ఆ ప్రాంతం స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది.

ఇప్పుడు మిడిల్ ఈస్ట్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ మీద ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ దాడులు తీవ్ర రూపు దాల్చాయి. దుబాయిలో ప్రఖ్యాతమైన ఓడరేవుల మీద.. విమానాశ్రయాల మీద.. విలాసవంతమైన హోటల్ ల మీద దాడులు జరిగాయి. వాస్తవానికి గల్ఫ్ దేశాలలో అత్యంత స్థిరమైన పెట్టుబడికి గమ్యస్థానంగా దుబాయ్ ఉంది. విదేశీ పెట్టుబడిదారులు కూడా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అటువంటి చోట ఇటువంటి పరిస్థితులు ఎదురు కావడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యుద్ధం ఇలానే కొనసాగితే.. దుబాయ్ మీద ఇలాగే దాడులు జరిగిపోతుంటే భవిష్యత్తు కాలంలో పెట్టుబడిదారులు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

దుబాయ్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం మందగమనం కొనసాగుతున్నప్పటికీ దుబాయిలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది. అటువంటి దుబాయ్ నగరంలో ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి రావడం ఆందోళన కలిగిస్తోందని పెట్టుబడిదారులు అంటున్నారు. ఇప్పటివరకైతే భారత్ లో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు కాబట్టి పెట్టుబడిదారులు ఇటువైపు చూసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అదే కనుక జరిగితే భారత్ నాలుగు నుంచి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News