https://oktelugu.com/

Vishal And Siva Karthikeyan: తెలుగులో సూర్య, విక్రమ్ ల మాదిరిగా విశాల్, శివ కార్తికేయన్ లు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు…

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేరే భాషల నుంచి హీరోలు వచ్చి వాళ్ల సినిమాలతో ప్రూవ్ చేసుకొని ఇక్కడ కూడా భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి మన హీరోలే వేరే భాషల్లో భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 13, 2024 / 01:59 PM IST

    Vishal And Siva Karthikeyan

    Follow us on

    Vishal And Siva Karthikeyan: తమిళ్ హీరోలకి తెలుగులో కూడా చాలా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లు మొదటి నుంచి కూడా వాళ్ళు చేసిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా వాళ్ళు మంచి విజయాలను అందుకొని ఇక్కడ కూడా వాళ్లకు సపరేట్ మార్కెట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. దీని వల్ల కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి హీరోలు ఇక్కడ కూడా స్టార్ హీరోలు గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వీళ్ల తర్వాత సూర్య, విక్రమ్ లాంటి హీరోలు తమిళం తో పాటు తెలుగులో కూడా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న హీరోల్లో విశాల్, శివ కార్తికేయన్ లాంటి హీరోలు ఒకటి రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించినప్పటికీ వరుస సక్సెస్ లను అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు తెలుగు మార్కెట్ మీద అంతగా కేర్ తీసుకోవడం లేదు. తెలుగు ప్రేక్షకుల్ని అలరించే సినిమాలను ఎందుకు చేయడం లేదు అనే విధంగా ఇప్పుడు వాళ్ల మీద కొన్ని విమర్శలైతే వస్తున్నాయి.

    కెరీర్ మొదట్లో విశాల్ పందెంకోడి, పొగరు లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యాడు. ఇక రొటీన్ కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడే తప్ప వైవిద్య భరితమైన సినిమాలను చేయడం లేదనే విమర్శలను రావడం తో ఆయనకి తెలుగు ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది. ఇక ఇది ఇలా ఉంటే శివ కార్తికేయన్ కూడా రెమో, ప్రిన్స్ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఆయన తర్వాత చేసిన ఒకటి రెండు సినిమాలు పెద్దగా ఆదరణను దక్కించుకోలేకపోయాయి.

    కాబట్టి ఇప్పుడు ఈయనకి కూడా తెలుగులో అంత పెద్ద మార్కెట్ అయితే లేదనే చెప్పాలి. కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీలోనే వీళ్ళు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగులో మాత్రం సక్సెస్ లను కంటిన్యూ చేయడంలో వాళ్ళు విఫలమవుతున్నారు మరి ఇకమీదటైనా వీళ్లు కంటిన్యూస్ గా హిట్స్ కొడితే సూర్య, విక్రమ్ మాదిరిగానే వీళ్ళకి కూడా తెలుగులో భారీ మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక ఇప్పటికైనా వీళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…

    ఒకప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుందంటే తెలుగులో ఉన్న ప్రొడ్యూసర్లు మన సినిమాలను రిలీజ్ చేయడానికి భయపడేవారు అంతటి స్ట్రాంగ్ కంటెంట్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేసే మేకింగ్ తో తమిళ్ సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల ముందు తమిళ్ సినిమా నిలబడలేకపోతుంది. ఇక ఇది తెలుగు సినిమా సాధించిన సక్సెస్ అనుకోవాలా లేదంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ సాదించిన ఫెయిల్యూర్ అనుకోవాలా…ఇక ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇండియా లోనే మన ఇండస్ట్రీ, మన హీరోలు టాప్ లో ఉండటం మన ఇండస్ట్రీ కి దక్కిన గొప్ప గౌరవం అనే చెప్పాలి…