https://oktelugu.com/

Indra: ఇంద్ర రీ రిలీజ్ తో చిరంజీవి ఇప్పుడున్న హీరోల దూకుడును అందుకోగలడా..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది..కొత్త సినిమాల రిలీజ్ విషయంలో కూడా చూపించలేని ఉత్సాహాన్ని అభిమానులు ఈ రీ రిలీజ్ ల విషయం లో చూపిస్తుండటం ఇప్పుడు అందరిలో అసక్తి ని కలిగిస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 13, 2024 / 02:29 PM IST

    Indra

    Follow us on

    Indra: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సంవత్సరాల నుంచి నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న నటుడు చిరంజీవి…ఇక 2001 లో వచ్చిన తన సూపర్ హిట్ సినిమా అయిన ‘ఇంద్ర ‘ మూవీని తన బర్త్ డే కానుకగా ఆగష్టు 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు రీ రిలీజ్ లా ట్రెండు ఎక్కువగా నడుస్తున్న సమయంలో చిరంజీవి చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. మహేష్ బాబు హీరోగా, కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మురారి సినిమాని రీసెంట్ గా రీ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి ఎనలేని క్రేజ్ రావడమే కాకుండా ఇప్పటి వరకు రీ రిలీజ్ చేసిన సినిమాలన్నింటిలో ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు బి గోపాల్ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఇంద్ర ‘ సినిమా ఇండస్ట్రీ హిట్టు కొట్టిన విషయం మనకు తెలిసిందే… ఇక ఇప్పుడు ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాతో చిరంజీవి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…

    ఒకవేళ చిరంజీవి సినిమాకి అంత ఆదరణ రాకపోతే ఇప్పుడున్న స్టార్ హీరోల చేతిలో చిరంజీవి ఓటమిపాలైనట్టే అంటూ కొంతమంది సినీ విమర్శకులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇంద్ర సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది… గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్ ‘ సినిమాని రీ రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమాకి మంచి ఆదరణ దక్కినప్పటికీ మెగాస్టార్ రేంజ్ కి సరిపడా విధంగా గుర్తింపు ను సంపాదించుకోలేకపోయింది.

    మరి ఇలాంటి సందర్బంలో ఇప్పుడు ఇంద్ర సినిమా విషయంలో ఎలాంటి వైఖరి నడుస్తుంది. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాని రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది…ఇక ఇప్పటివరకు రీ రిలీజ్ చేసిన అన్ని సినిమాలను మించి ఈ సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి… ఇక ఇదిలా ఉంటే హీరోల విషయం పక్కన పెడితే వాళ్ళ అభిమానుల మధ్య పోటీ అనేది తీవ్ర తరమైంది. అందువల్లే మా హీరో సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావాలి అనే ఉద్దేశ్యంతో రీ రిలీజ్ ల విషయంలో ఆయా హీరోల అభిమానులు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాలను చూడటానికి ముందుకు వస్తున్నారు.

    ఇక మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ సినిమాలు రీరిలీజ్ అయితే భారీ కలెక్షన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమాలకు మాత్రం భారీ రేంజ్ లో ఆదరణ అయితే దక్కుతుంది… ఇక ఇలాంటి పరిస్థితి లో చిరంజీవి రీ రిలీజ్ లో కూడా మెగాస్టార్ అనిపించుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…