Homeఎంటర్టైన్మెంట్Salaar 2 Story: 'సలార్ 2' కథ మామూలుగా లేదట... ప్రభాస్ ను అలా చూస్తే...

Salaar 2 Story: ‘సలార్ 2’ కథ మామూలుగా లేదట… ప్రభాస్ ను అలా చూస్తే ప్రేక్షకులు తట్టుకుంటారా..?

Salaar 2 Story: హీరో అంటే ఎలా ఉండాలి. రోడ్ సైడ్ రోమియో ల ఉండాలా, చిప్పిరి జుట్టు వేసుకుని, చిరిగిన ప్యాంట్లతో కనిపించాలా? ఇంతకీ ఎలా ఉండాలి? అనే ప్రశ్న ప్రతి ఒకరిలో మెదులుతుంది. నిజానికి అవేవీ కాదు ప్రతి ప్రేక్షకుడిలో హీరో అంటే ఆరడుగుల హైట్, కండలు తిరిగిన దేహంతో ఉన్నప్పుడే అతను హీరో అనే ఒక ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఏర్పాడుతుంది. అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ రాణిస్తారు…ప్రభాస్ ను చూస్తే ప్రతి ఒక్కరికి హీరో అనే ఫీలింగ్ కలుగుతుంది… యంగ్ రెబల్ స్టార్ గా కెరియర్ ను స్టార్ చేసిన నరుడు ప్రభాస్…బాహుబలి సినిమాతో ఇండస్ట్రీలో ఎవరికీ దక్కని గౌరవాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. బాలీవుడ్ హీరోలకు సైతం చెమటలు పట్టించిన ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఇండియాకే పరిమితమయ్యాయి. ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకోవాలని చూస్తున్నాడు. 2023వ సంవత్సరంలో వచ్చిన ‘సలార్’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తన మేకింగ్ తో సినిమాకి ఎక్కడలేని గుర్తింపైతే తీసుకొచ్చాడు. ప్రభాస్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించాడు అంటూ ప్రశంసలను అందుకున్నాడు. రాజమౌళి తర్వాత ప్రభాస్ ను ఆ రేంజ్ లో వాడుకున్న దర్శకుడు కూడా ప్రశాంత్ నీల్ కావడం విశేషం…ఇక అలాంటి దర్శకుడు ఇప్పుడు ‘సలార్ 2’ సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు.

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే సినిమాని చేస్తున్నప్పటికి ‘సలార్ 2’ సినిమా స్క్రిప్ట్ మొత్తం ఫినిష్ అయిపోయిందట. కథను ప్రొడ్యూసర్ కి వినిపించడంతో ఆయన చాలా ఎక్సైట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఒక డిఫరెంట్ గెటప్ లో ప్రభాస్ మనకు కనిపించబోతున్నారట.

అది ఒక 15 నిమిషాల పాటు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ తో ఎలాంటి గెటప్ ని వేయిస్తున్నాడు. ప్రభాస్ ఆ గెటప్ కి సెట్ అవుతాడా? లేదా అనేది కూడా ప్రేక్షకుల్లో ఒక ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు సైతం ప్రభాస్ ను డిఫరెంట్ వేరియేషన్స్ లో చూడడానికి ఎప్పటినుంచో తాపత్రయపడుతున్నారు.

కానీ ప్రభాస్ మాత్రం అలాంటిదేమి చేయడం లేదు. సలార్ 2 సినిమాలో ఆయన క్యారెక్టర్జేషన్ తోపాటు అతని వేషధారణ కూడా డిఫరెంట్ గా ఉంటుందట. ఒక 15 నిమిషాలు తన క్యారెక్టర్ లో వేరియేషన్స్ కూడా ఉండబోతున్నాయట. మరి ఆ క్యారెక్టర్ తాలూకు ఇంటెన్సిటి ఏంటి దాని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version