Shravanamasam 2025: ప్రతి ఒక్కరికి రెండు జీవితాలు ఉంటాయి. ఒకటి పెళ్లికి ముందు.. మరొకటి పెళ్లి తర్వాత.. పుట్టినప్పటినుంచి పెళ్లయ్యేంతవరకు అమ్మానాన్నల పైనే ఆధారపడి జీవిస్తారు.. కానీ వివాహమైన తర్వాత సొంత జీవితం ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే బరువు, బాధ్యతలు ఉంటాయి. వీటిని సమర్థవంతంగా మోయాలంటే ఒకరితో సరిపోదు. వారికి అదనపు శక్తి కావాలి. అందుకోసం దైవానుగ్రహం ఉండాలి. చాలామంది పెళ్లికి ముందు టెంపుల్ వైపు చూడని వారు.. పెళ్లయిన తర్వాత వారానికి రెండుసార్లు ఆలయానికి వెళ్లేవారు ఉన్నారు. అంటే ఇదే సమయంలో మనిషికి ఆధ్యాత్మిక భావన ఏర్పడుతుంది. అయితే పెళ్లయిన కొత్తగా పెళ్లయిన వారు ముందుగానే ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే దైవానుగ్రహం కోసం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. పూజలు, వ్రతాలు చేసే సమయంలో క్రమ పద్ధతిలో ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో కొత్తగా పెళ్లయిన వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే?
Also Read: ఈ శ్రావణమాసంలో మటన్ తింటున్నారా?
పూర్వకాలంలో పెద్దలు తమ పిల్లలకు భవిష్యత్తులో ఎలా ఉండాలో నేర్పేవారు. కానీ ఇప్పుడు చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల ద్వారా కంటే మొబైల్ ద్వారా అని ఎక్కువగా నేర్చుకుంటున్నారు. కానీ ఫోన్లో వచ్చేవి ఏవి నిజమో..? ఏమీ అబద్ధమో..? తెలియకుండా ఉంది. కొత్తగా పెళ్లయిన వారికి ఇంట్లో పెద్దవారు ఎలా ఉండాలి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు వారి మాట ఎవరు వినడం లేదు. అయితే కొందరు పండితులు చెబుతున్న ప్రకారం కొత్తగా పెళ్లయిన వారు శ్రావణమాసంలో ఇలా ఉండాలని అంటున్నారు.
శ్రావణ మాసంను ఆధ్యాత్మిక నెలగా భావిస్తారు. ఈ నెలలో కొన్ని వ్రతాలు, పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతారు. అందువల్ల ఈనెల మొత్తం ఉదయమే లేచే ప్రయత్నం చేయాలి. అంటే సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కుదిరితే పూజ గదిలో దీపం ఉంచాలి. కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రం దీపాలు వెలిగించడం వల్ల ఇల్లు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది.
పెళ్లయిన వారు వెంటనే కోరుకునేది సంతానం. మంచి సంతానం కావాలని కోరుకునేవారు ఈ నెలలో వరలక్ష్మీ వ్రతం చేయడంవల్ల విశేష ఫలితాలు ఉంటాయని కొందరు చెబుతున్నారు. అయితే వరలక్ష్మీ వ్రతం చేసే ముందు నియమాలు తెలుసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే వరలక్ష్మీ వ్రతంలో నిర్వహించే వారిని సంప్రదించి వారు అనుసరించే పద్ధతులను పాటించాలని అంటున్నారు. వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల అమ్మవారు సంతాన విషయంలో అనుగ్రహిస్తారని చెబుతున్నారు.
Also Read: ఆధ్యాత్మికం.. మానసిక ప్రశాంతతకు నిలయాలు.. ఇప్పుడు మన రాజమండ్రిలో ‘ఏకాంత ధ్యాన వాసం’
అలాగే ఈ నెలలో మంగళ గౌరీ వ్రతం కూడా చేయవచ్చు. ఈ వ్రతం చేయడం వల్ల వారి దాంపత్య జీవితం సంతోషకరంగా సాగుతుంది. ముఖ్యంగా ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు కాపాడుతారని చెబుతారు. అయితే మంగళ గౌరీ వ్రతం చేసే సమయంలో ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ నెలలో సోమ, శుక్ర, శనివారాల్లో ఆలయాలను దర్శించుకోవాలని.. మిగతా రోజుల్లోనూ దైవచింతల ఎక్కువగా ఉండడంవల్ల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.