Hari Hara Veera Mallu Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ డిజాస్టర్ ఫ్లాప్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి ఈ సినిమాపై జనాల్లో అంచనాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ సినిమా అంటే క్రేజ్ సహజంగానే విడుదలకు ముందు వచ్చేస్తుంది కదా, అలా ఈ సినిమాకు కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రీమియర్ షోస్ ప్రతీ సెంటర్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో. ఒక్క నైజాం ప్రాంతం లోనే ఈ సినిమాకు 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 3 కోట్ల 32 లక్షలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తప్ప మరొకరు కొట్టలేని అనితర సాధ్యమైన రికార్డు ఇది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ కి ఇదే రేంజ్ రెస్పాన్స్.
Also Read: రజినీకాంత్ చివరి చిత్రం అదేనా..?అతని డ్రీమ్ మూవీ కోసం అడుగులు వేస్తున్నాడా..?
కానీ ప్రీమియర్స్ నుండి వచ్చిన టాక్ మాత్రం రెగ్యులర్ షోస్ మీద ఘోరమైన ప్రభావం చూపించింది. ఫలితంగా కేవలం కోస్తాంధ్ర నుండే 40 కోట్ల షేర్ రావాల్సిన ఈ చిత్రానికి, ఆంధ్ర ప్రదేశ్ + కోస్తాంధ్ర కు కలిపి 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నైజాం ప్రాంతం లో నిన్న ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ బాగా ఉండడం వల్ల ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. దానికి తోడు పైడ్ ప్రీమియర్ షోస్ బాగా కలిసొచ్చాయి అనే చెప్పాలి. ప్రీమియర్ షోస్ నుండి వచ్చిన 3 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ తో మొదటి రోజు వసూళ్లను కలిపితే దాదాపుగా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలకు కలిపి 37 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి.
Also Read: వార్ 2 ట్రైలర్ రివ్యూ: ఇద్దరు రూత్ లెస్ ఏజెంట్స్ తలపడితే? బ్లాస్టింగ్ విజువల్స్!
ఇక వరల్డ్ వైడ్ గా కలుపుకొని చూస్తే దాదాపుగా 45 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ కి చాలా అంటే చాలా తక్కువ. ప్రస్తుతం విస్తరించిన మార్కెట్ లో పవన్ కళ్యాణ్ రేంజ్ స్టార్ హీరోలకు వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తున్నాయి. ఈ చిత్రానికి అందులో సగం కూడా రాలేదు. డిస్ట్రిబ్యూషన్ సరిగా జరగకపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో అసలు విడుదలకు కూడా నోచుకోలేకపోయింది ఈ చిత్రం. అంతే కాకుండా హైర్స్, SG హైర్స్, MG హైర్స్ వంటివి కూడా ఈ చిత్రానికి జరగలేదు. ఫలితంగా నంబర్లు భారీగా కనపడలేదు. ఇక రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే నిల్. రేపు, ఎల్లుండి వీకెండ్ కాబట్టి, కాస్త డీసెంట్ వసూళ్లు నమోదు అవ్వొచ్చు.