Mutton during Sravanamasam: పండుగల సీజన్ శ్రావణమాసంతో ప్రారంభమవుతుంది. ఇప్పటినుంచి వరుసగా పండుగలు వస్తుంటాయి. దీంతో ప్రతి ఇంట్లోనూ.. ప్రతి ఆలయాల్లోనూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. శ్రావణమాసం అనగానే పూజలు, వ్రతాలు, ఉపవాసాల గురించి చెబుతూ ఉంటారు. శ్రావణమాసంలో నెల రోజులపాటు నిష్టగా ఉంటూ కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఈ నెలలో ఎలాంటి మాంసాహారాన్ని ముట్టకుండా ఉంటారు. అయితే ఈ నెలపాటు మాంసాహారాన్ని ముట్టకుండా ఉండాలని పెద్దలు నిర్ణయించాలని చెబుతారు. అలా వారు ఎందుకు నిబంధనలు పెట్టారు? ఈ నెలలో మాంసాహారం తింటే ఏమవుతుంది? కేవలం పూజల కోసమే తినకుండా ఉంటారా?
Also Read: ఈ రాశి వ్యాపారుల ఇంట్లోకి ఈరోజు లక్ష్మీదేవి ప్రవేశం..
వర్షాకాలం ప్రారంభం కాగానే ఆషాడమాసం వస్తుంది. వర్షాకాలం మధ్యలో శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో వాతావరణం కలుషితంగా మారే అవకాశం ఉంటుంది. ఒకవైపు తేమ ఉంటూ మరోవైపు గాలిలో అనేక క్రిములు ప్రవహిస్తూ ఉంటాయి. అందువల్లే ఇలాంటి సమయంలో ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి. పూర్వకాలంలో వ్యాధులకు, అనారోగ్యాలకు సరైన చికిత్సలు లేవు. సరైన ఆహారం తీసుకోవడమే అసలైన చికిత్స అని భావించేవారు. అందుకే కొందరు పెద్దలు క్రమ పద్ధతిలో ఆహారం తీసుకుంటే ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటామని గుర్తించారు. అందువల్ల సీజనల్ వైస్ గా ఆహారాన్ని తీసుకుంటూ వచ్చి ఆరోగ్యంగా ఉన్నారు.
అలాగే వర్షాకాలంలోనూ కొన్ని ప్రత్యేక ఆహారాలు తీసుకోవాలని నియమాలు పెట్టుకున్నారు. ఈ కాలంలో ఎక్కువగా వాతావరణం కలుషితం కావడంతో ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా చేరుతుంది. గాలిలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండడంతో ఇవి అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉండి పదార్థాలను నేరుగా తీసుకోవడం వల్ల జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో గొర్రెలు, కోళ్లు అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వీటి మాంసాహారం తినడం వల్ల ఆ బ్యాక్టీరియా అలాగే ఉండిపోయి మనుషుల్లోకి చేరే అవకాశం ఉంది.
అందువల్ల శ్రావణమాసంలో మాంసాహారాన్ని ముట్టకుండా ఉండాలని నియమాలు పెట్టారు. అయితే ఇదే నెలలో పండుగలు కూడా రావడంతో వాటికి జోడించి సాత్విక ఆహారం తీసుకుంటూ ప్రత్యేక పూజలు చేయడం వల్ల దైవానుగ్రహం కూడా తోడు అవుతుందని భావించి.. శ్రావణమాసంలో ఉపవాసం ఉండాలని నిర్ణయించారు. అలా శ్రావణమాసం మొత్తం నిష్టతో ఉంటూ ప్రత్యేక పూజలు చేస్తూ వస్తున్నారు.
Also Read: ఏపీకి మూడు రోజులు హై అలెర్ట్.. ఏమవుతుందో?
అలాగే ఈ నెలలో వరలక్ష్మీ వ్రతం, నాగ పంచమి, మంగళగౌరి వ్రతం వంటి రోజుల్లో మహిళలు ఉపవాసాలు ఉంటూ దేవులను కొలుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారి మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు.. ఒకరోజు తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారని చెబుతున్నారు. అలాగే ఇప్పుడున్న వాతావరణం లో ఎలాంటి ఆహారమైనా జీర్ణం కావడానికి కొన్ని సమస్యలు ఉంటాయి. అందువల్ల సాత్విక ఆహారం తీసుకుంటూనే.. కొన్ని రోజులపాటు ఉపవాసాలు చేస్తే మరింత ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల శ్రావణమాసం మొత్తం పూజలు, వ్రతాలతోపాటు మాంసాహారాన్ని ముట్టకుండా ఉండాలని పెద్దలు నిర్వహించారు. వీటిని పాటించేవారు ఆరోగ్యంగా ఉంటారని కూడా చెబుతున్నారు.