Shani Dev
Shani Dev : శని దేవుడు పేరు చెప్పగానే కొందరు చాలా భయపడిపోతూ ఉంటారు. ఒకసారి శనిపీడ పట్టిందంటే ఏడేళ్ల వరకు ఉంటుందని అంటూ ఉంటారు. కానీ మనుషులు చేసే తప్పులను గుర్తిస్తూ వాటికి సరైన శిక్షలు వేస్తూ న్యాయ దేవుడిగా శని గురించి చెప్పుకుంటారు. అయితే శని అనుగ్రహం వల్ల వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇదే రోజున శని మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో శని సూర్యుడుతోపాటు శుక్రుడు, రాహు గ్రహాలతో కలిసి ప్రయాణించనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. ఆ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకొని ఉన్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం..
Also Read : చంద్రగ్రహణం రోజున ఈ రాశి వారికి లక్కీ డే.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
శని దేవుడు మీన రాశిలోకి ప్రవేశించడంతో తులా రాశి వారి జీవితాల్లో అనేక మార్పులు జరగనున్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. కొత్తగా ప్రాజెక్టులు చేపడుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు సహాయంతో నూతన పెట్టుబడులు పెడతారు.
వృషభ రాశిపై మార్చి 29 నుంచి శని ప్రభావం ఉండనుంది. ఈ సందర్భంగా వీరి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదించిన ఉన్నాడు. ఈ రాశి వారు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా ధనాన్ని పొందగలుగుతారు. డబ్బు అవసరం ఉంటే వెంటనే సమకూరుతుంది. బంధువులు ఇంటికి రావడంతో ఇల్లు సందడిగా మారుతుంది. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది.
మిథున రాశి వారికి శని దేవుడి అనుగ్రహం మార్చి 29 నుంచి కలగనుంది. ఈ రాశి వారికి ఈ తేదీ నుంచి కొత్త జీవితం ప్రారంభం కానుంది. గతంలో పడిన కష్టమంతా వీరు మర్చిపోతారు. చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కష్టపడిన వారికి సరైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఏ చిన్న అనారోగ్యం కలిగిన వెంటనే రైతులను సంప్రదించాలి. లేకుంటే భారీ నష్టమే ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఇవి భవిష్యత్తులో అనేక లాభాలను తెస్తాయి.
కన్యా రాశి వారు మార్చి 29 నుంచి అనేక లాభాలను పొందుతారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రోత్సాహకరమైన ఆదాయాన్ని పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. తోటి వారి సహాయంతో అధిక ఆదాయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. స్నేహితుల ద్వారా ధన సహాయాన్ని పొందుతారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాల విషయంలో కొన్ని రోజులు వేచి ఉండడం మంచిది.