Ram Charan: బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరోలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) కూడా ఒకడు. ‘మగధీర’ సినిమా నుండే ఈయనకు విపరీతమైన పాపులారిటీ ఏర్పడింది. ఆ తర్వాత ఆయన నటించిన నాయక్, ఎవడు చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్ ని అక్కడి ఆడియన్స్ ఎగబడి చూసారు. ముఖ్యంగా ఎవడు చిత్రం అంటే హిందీ ఆడియన్స్ మెంటలెక్కిపోతుంటారు. అలా నార్త్ ఇండియా లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రామ్ చరణ్ ‘జంజీర్’ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు 28 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ మళ్ళీ హిందీ లో నటించలేదు.
Also Read: సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు..మధ్యలోనే ఆగిపోయిన సినిమా!
#RRR లాంటి పాన్ ఇండియన్ చిత్రంతో బాలీవుడ్ ఆడియన్స్ ని మరోసారి పలకరించాడు. ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, రామ్ చరణ్ కి అద్భుతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కారణంగా ఆయన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) కి డిజాస్టర్ ఫ్లాప్ వచ్చింది. అయినప్పటికీ బాలీవుడ్ లో 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. ఇదంతా చూస్తుంటే ఒక్క పర్ఫెక్ట్ సినిమా చాలు, రామ్ చరణ్ బాలీవుడ్ లో అల్లు అరుణ్ లాగా జెండా పాతేయగలడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్ లో రామ్ చరణ్ కి మొదటి నుండి టాప్ స్టార్స్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. బాలీవుడ్ టాప్ 2 హీరోలుగా పిలవబడే షారుక్ ఖాన్(Shahrukh Khan), సల్మాన్ ఖాన్(Salman Khan) వంటి వారు రామ్ చరణ్ ని తమ సొంత తమ్ముడిలాగా భావిస్తారు.
అదే విధంగా అక్షయ్ కుమార్(Akshay Kumar) కూడా రామ్ చరణ్ కి బెస్ట్ ఫ్రెండ్. వీళ్లిద్దరు కలిసి ఒక ఈవెంట్ లో డ్యాన్స్ చేసి వీడియో అప్పట్లో ఎంతో వైరల్ అయ్యిందో మనమంతా చూసాము. అయితే ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ లో రామ్ చరణ్ కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. అదేంటి చరణ్ ఇక్కడున్నాడు, ఈ చిత్రం లో ఆయనేమైనా స్పెషల్ రోల్ చేస్తున్నాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో రామ్ చరణ్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ అనే చిత్రం లో సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్ లతో కలిసి డ్యాన్స్ వేశాడు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది రామ్ చరణ్ టీం చెప్పాలి.