SRH Vs RR (4)
SRH Vs RR: ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ తీసుకున్న నిర్ణయం తప్పని హైదరాబాద్ ఆటగాళ్లు నిరూపించారు. ఈ కథనం రాసే సమయం వరకు ఆరు ఓవర్లలో హైదరాబాద్ జట్టు ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (24), హెడ్(42*), ఇషాన్ కిషన్(20*) దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి వికెట్ కు అభిషేక్ శర్మ, హెడ్ 45 పరుగులు జోడించారు. మహేష్ తీక్షణ బౌలింగ్లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ పట్టిన క్యాచ్ కు అతడు వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఈశాన్ కిషన్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. అచ్చి వచ్చిన మైదానంపై 300 స్కోర్ మార్క్ చేసే విధంగా కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ 300 స్కోర్ చేస్తామని ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. సొంత మైదానం కావడం..సొంత ప్రేక్షకుల బలం ఉండడంతో హైదరాబాద్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ప్లాట్ పిచ్ పై పరుగుల వరద పారిస్తున్నారు.
Also Read: SRH పక్కా 300 కొడుతుంది.. కమిన్స్ ఏమన్నాడంటే.
కావ్య పాప వచ్చింది
ఉప్పల్లో జరుగుతున్న మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ (sunrisers Hyderabad team owner Kavya maaran) వచ్చేసింది. గ్యాలరీలో కూర్చున్న ఆమె హైదరాబాద్ ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తోంది. అభిషేక్ శర్మ, హెడ్ దూకుడుగా ఆడుతున్నప్పుడు చప్పట్లు కొట్టి అభినందించింది. అభిషేక్ శర్మ అవుట్ అయినప్పటికీ.. హెడ్, ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న నేపథ్యంలో కావ్య కూడా ఎగిరి గంతులు వేసింది.. గ్యాలరీలో కూర్చొని.. వారిద్దరి బ్యాటింగ్ ఆస్వాదించింది. చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.. హైదరాబాద్ జట్టు ఓనర్ గా కావ్య క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. అవి సోషల్ మీడియాలో సంచలనం అవుతుంటాయి. గత సీజన్లోనూ కావ్య ఇదే తీరుగా తన అందమైన హావభావాలతో ఆకట్టుకుంది. ఆమె రాకతో మైదానంలో సందడి నెలకొనేది. హైదరాబాద్ జట్టు ఆడుతున్న మ్యాచులు చూసేందుకు అభిమానులు భారీగా వస్తున్నారంటే అందులో సగం కారణం కావ్య మారన్ అంటే అతిశయోక్తి కాక మానదు. గత సీజన్లో హైదరాబాద్ జట్టు ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత కావ్య బాధపడింది. గ్యాలరీలో తన తండ్రి భుజం మీద తలవాల్చి కన్నీటి పర్యంతమైంది. ఇక సౌత్ ఆఫ్రికా టి20 లీగ్ లో కావ్య మారన్ ఓనర్ గా ఉన్న సన్రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు ముంబై ఇండియన్స్ పై ఓటమిపాలైంది.. అయితే ఈసారి ఎలాగైనా ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టును విజేతగా నిలపాలని కావ్య బలంగా డిసైడ్ అయింది. అందువల్లే మెగా వేలంలో సమర్థవంతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది.