Sankranthi 2026 Quotes: తెలుగు వారంతా ఎంతో సంతోషంగా జరుపుకునే సంక్రాంతి పండుగ రానే వచ్చింది. భోగి పండ్లతో.. సంక్రాంతి ముగ్గులతో.. హరిదాసుల కీర్తనలు.. పిండి వంటలు.. కొత్త అల్లుళ్లు వంటి సందడితో సంక్రాంతిని మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించుకుంటారు. అయితే పండుగ సందర్భంగా చాలామంది తమ ఆత్మీయులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలపాలని అనుకుంటారు. కానీ సుదూర ప్రాంతాల నుంచి కొందరికి రావడానికి వీలుకాదు. ఈ సమయంలో తమకు నచ్చిన వారికి ఆన్లైన్లో విషెస్ చెప్పాలని చూస్తారు. అయితే ఈ విషెస్ సాధారణంగా కాకుండా అందమైన కొటేషన్తో చెప్పడం వల్ల ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పండుగ సందర్భంగా వారి మనసులో మీ ఆత్మీయతను గుర్తించేందుకు ఈ కొటేషన్ల ద్వారా పండుగ శుభాకాంక్షలు తెలపండి. ఆ కొటేషన్లలోకి వెళ్తే..
మీకు ఆనందం, సంతోషం తో కూడిన ఈ పండుగ ఎంతో వైభవంగా సాగాలని మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.
భోగిమంటలతో మీ చింతలన్నీ తొలగిపోవాలి.. మీ జీవితంలో కొత్త కాంతిని తీసుకురావాలి.. అని కోరుకుంటూ పొంగల్ శుభాకాంక్షలు.
ఈ దివ్యమైన పండుగ రోజు మీ జీవితం ఎంతో శ్రేయస్సుతో ఉండాలని కోరుకుంటూ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ ఏడాదంతా ఉత్సాహంగా ఉండాలని.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపాలని మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ పండుగ రోజులు మీరు ఆనందంతో గడపాలని కోరుకుంటూ.. అంతులేని ఆనందాన్ని మీకు ఆ భగవంతుడు ప్రసాదించాలని అనుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు.
భోగిమంటలతో మీ దుఃఖాలన్నీ దహనం కావాలని.. జీవితంలో అన్ని సంతోషాలే ఉండాలని కోరుకుంటూ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
ఈ సంక్రాంతి పండుగతో మీ జీవితం వైభవంగా సాగాలని కోరుకుంటూ.. హ్యాపీ పొంగల్.
ప్రతి క్షణం మీ జీవితంలో సంతోషం నిండాలని.. ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు.
ఇళ్ల వాకిళ్లు రంగురంగుల ముగ్గులతో.. పిండి వంటలతో కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు.
మీ జీవితం ఈ సంక్రాంతి నుంచి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటూ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.
భోగి మంటలతో మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి.. సంక్రాంతి నుంచి కొత్త జీవితం సంతోషంగా గడపాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
మీలోని చెడు, వ్యసనాలు ఈ భోగి మంటలతో తొలగిపోయి.. కొత్త జీవితం ప్రసాదించాలని కోరుకుంటూ సంక్రాంతి 2026 శుభాకాంక్షలు.
గడిచిన రోజులను వదిలేసి.. రాబోయే రోజుల్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ భోగి, సంక్రాంతి 2026 శుభాకాంక్షలు.
ఈ భోగితో మీ కుటుంబంలో ఉన్న సమస్యలని తొలగిపోవాలని.. సంక్రాంతి నుంచి సంతోషాలు నిండాలని కోరుకుంటూ సంక్రాంతి 2026 శుభాకాంక్షలు.
రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగురుతున్నట్లు.. మీ జీవితం కూడా సంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటూ.. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.
మీ జీవితంలో ఇకనుంచి కొత్త రోజులు.. అవి మంచి రోజులు కావాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు..