Yamaha Zuma 125 CC: ఒకప్పుడు యూత్ బైక్ కొనాలంటే Yamaha కంపెనీ వైపే చూసేవారు. అయితే ఆ తర్వాత ఈ కంపెనీకి అనేక బైక్స్ పోటీకి రావడంతో యమహా హవా తగ్గింది. కానీ ఇప్పుడు తిరిగి పుంజుకోవడానికి ఈ కంపెనీ కొత్త బైక్లను తీసుకొస్తుంది. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా యమహా కంపెనీ ప్రత్యేకమైన స్కూటర్ ను విడుదల చేసింది. ఇది స్కూటర్ అయినా కూడా యూత్ తో పాటు రోజువారి వినియోగదారులకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే దీని డిజైన్ అదర్ హో అని అంటారు. అంతేకాకుండా లీటర్ ఇంధనానికి 45 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడంతో ఉద్యోగులకు ఇది బెస్ట్ స్కూటర్ అని అంటున్నారు. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణించేసేవారికి ఇది ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అయితే ఇందులో ఉండే ఫీచర్స్, టెక్నాలజీ ఏవిధంగా ఉందో ఇప్పుడు చూద్దాం..
Yamaha కంపెనీ కొత్తగా Zuma 125 CC మీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని డిజైన్ చూస్తే వెంటనే కొనాలని అనుకుంటారు. ఆకట్టుకునే విధంగా హెడ్ లాంప్, హాయ్ సేటు పెండర్, మినిమలిస్ట్ బాడీ వర్క్ అడ్వెంచర్ బైక్ లాగా అనిపిస్తుంది. దీనికి దూరమైన స్టీల్ ఫ్రేమ్ ఉండడంతో ప్రమాద సమయంలో సరైన భద్రతను అందిస్తుంది. అలాగే కఠినమైన రోడ్లపై కూడా సులభంగా వెళ్లేలా టైర్లను సెట్ చేశారు. 12 అంగుళాల ఫ్యాట్ టైర్లతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఫ్యామిలీ వారికి కూడా ఈ బైక్ అనుగుణంగా ఉంటుంది.
ఇందులో ఫీచర్లు లేటెస్ట్ టెక్నాలజీతో సెట్ చేశారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తో పాటు LED లైటింగ్ సిస్టం, USB చార్జింగ్ పోర్టు, అండర్ సీట్ స్టోరేజ్ వంటి ఫీచర్లో ఉన్నాయి. దీంట్లో సరుకులు తీసుకెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే గ్రిప్ తో పాటు CBS బ్రేకింగ్ సిస్టం కూడా ఉండడంతో నగరాల్లో ప్రయాణం చేసే వారికి సౌకర్యంగా ఉంటుంది. ఇందులో 125 సిసి పెట్రోల్ ఇంజన్ ను చేర్చారు. ఇది సమతుల్య పవర్ డెలివరీని అందిస్తూ ఇంద్ర ఖర్చులను తగ్గిస్తుంది. ఈ ఇంజన్ పై లీటర్ ఇందడానికి 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజ్ అందించగలరు. సులభవంతమైన స్టీరింగ్, సౌకర్యవంతమైన సీట్లు ఉండడంతో ఎలాంటి శారీరక అలసట లేకుండా ప్రయాణం చేయవచ్చు. రోడ్లు ఎలా ఉన్నా.. ప్రయాణం ఒకే విధంగా ఉంటుంది.
ఈ స్కూటర్ ప్రస్తుతం మార్కెట్లో రూ.1.10 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంటు రూ.1.30 లక్షల వరకు ఉంది. దీనిని కొనడానికి ఒకేసారి చెల్లించకుండా..EMI ద్వారా కూడా పొందవచ్చు. అయితే సంబంధిత బ్యాంకు క్రెడిట్ కార్డులు మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. యమహా పై మక్కువగా ఉన్న వారితో పాటు.. రోజువారి వినియోగస్తులు కూడా దీనిని కొనుగోలు చేసి తమకు అనుకూలంగా ఉంచుకోవచ్చు.