Planes Are Same Way: జూన్ 3న అకాశంలో అద్భుతం.. ఎప్పుుడు, ఎలా చూడాలి?

Planes Are Same Way:విశ్వంలో ఉన్న గ్రహాలు ఒక్కో గ్రహం ఒక్కో కక్షను కలిగి ఉంటాయి. సూర్యుడి చుట్టూ తిరిగే శుక్రుడు, ఇతర గ్రహాలతో సమానంగా కలుస్తుంది.ఒక్కోసారి బృహస్పతి, సూర్యుడు, శుక్రుడు ఒకే వరుసలోకి రావొచ్చు. కానీ ఈసారి బుధ, గురు, అంగారక, శని, యురేనస్, నెప్ల్యూన్ గ్రాహాలన్నీ ఒకే వరుసలోకి రానున్నాయి.

Written By: Chai Muchhata, Updated On : May 28, 2024 11:54 am

Five Grahe horoscope

Follow us on

Planes Are Same Way:ఆకాశం అద్భుతాతకు వేదిక. ఊహించిన సంఘటనలు ఎన్నో జరగుతూ ఉంటాయి. నక్షత్రాలు, గ్రహాల సముదాయం ఉన్న విశ్వంలో ఒక్కోసారి గ్రహాలు ఒకే కక్షలోకి వస్తాయి. ఇప్పటి వరకు రెండు లేదా మూడు గ్రహాలు మాత్రమే అలా ఒకే రూట్ లోకి వచ్చాయి. కానీ ఈసారి ఏకంగా ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం చాలా అరుదు. ఈ అద్భుతం జూన్ 3న జరగనుంది. అనంత విశ్వంలో చోటు చేసుకునే కొన్ని పరిణామాల వల్ల ఇది జరగబోతుంది. ఇలా గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రావడం వల్ల ఏం జరగుతుంతో తెలుసా?

విశ్వంలో ఉన్న గ్రహాలు ఒక్కో గ్రహం ఒక్కో కక్షను కలిగి ఉంటాయి. సూర్యుడి చుట్టూ తిరిగే శుక్రుడు, ఇతర గ్రహాలతో సమానంగా కలుస్తుంది.ఒక్కోసారి బృహస్పతి, సూర్యుడు, శుక్రుడు ఒకే వరుసలోకి రావొచ్చు. కానీ ఈసారి బుధ, గురు, అంగారక, శని, యురేనస్, నెప్ల్యూన్ గ్రాహాలన్నీ ఒకే వరుసలోకి రానున్నాయి. దీంతో పాఠశాలతో చదువుకున్న సమయంలో పుస్తకంలో ఉన్న విధంగా గ్రహాలన్నీ ఒకే విధంగా, ఒకే వరుసలోకి రానున్నాయి.

అయితే వీటిలో కొన్నింటిని మాత్రమే నేరుగా చూడనున్నారు. మిగతావి బైనాక్యూలర్ సహాయంతో చూడాల్సి ఉంటుంది. గ్రహాల వరుస క్రమంలో భాగంగా ముందుగా ఒక కక్షలోని శని గ్రహం వస్తుంది. ఆ తరువాత వరుసగా నెప్ట్యూన్, గురు, యురేనస్, బుధుడు వస్తాడు. ఈ గ్రహాల వరుస కారణంగా శనిగ్రహం కుంభ రాశి, నెప్ట్యూన్ మీనం, యురేనస్ మేషం, బుధ గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశిస్తాయి. దీంతో ఈ రాశుల వారి జీవితాలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

గ్రహాల వరుస క్రమాన్ని చూసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కొందరు టెలిస్కోప్, బైనాక్యూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. అకాశంలో జరిగే ఈ అద్భుతాన్ని చూపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ‘నాసా’ తెలిపింది. అంతేకాకుండా ఈ వరుస క్రమంపై అధ్యయనం చేయడానికి సిద్ధమవుతోంది. జూన్ 3న సూర్యోదయానికి ముందు 25 నిమిషాల ముందు ఈ అద్భుతాన్ని చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.