Homeక్రైమ్‌Man shoots himself chest: పిచ్చికి పరాకాష్ట : రీల్స్ మాయలో తనను తానే కాల్చేసుకున్నాడు.....

Man shoots himself chest: పిచ్చికి పరాకాష్ట : రీల్స్ మాయలో తనను తానే కాల్చేసుకున్నాడు.. చచ్చాడు..

Man shoots himself chest: సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని.. రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలని చాలామంది అనుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారు.. ఫలితంగా ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరైతే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ తరహాలో దారుణాలు చోటుచేసుకుంటున్నప్పటికీ.. జనాలు ఇంకా సోషల్ మీడియా మాయ నుంచి బయటికి రావడం లేదు. పైగా నిత్యం సోషల్ మీడియాలోనే మునిగి తేలుతున్నారు.

వాస్తవానికి సోషల్ మీడియా అనేది ఒక మాయ ప్రపంచం. అందులో కనిపించేది ఏది నిజం కాదు. మోసం.. దగా.. కుట్ర.. అబద్ధం.. చుట్టూ సోషల్ మీడియా నడుస్తూ ఉంటుంది. కాకపోతే సోషల్ మీడియాలో కాల్పానిక ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి.. చాలామంది దానినే నిజమని నమ్ముతుంటారు. అదే వాస్తవమని అందులో జీవిస్తుంటారు..

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో రీచ్ కోసం అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ సమయంలో ప్రమాదాలకు గురవుతుంటారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. మహారాష్ట్రలో ఓ యువతి కొండ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ రీల్ చేస్తుండగా.. కాలుజారి లోయలో పడింది. తీవ్రంగా గాయపడి కన్ను మూసింది. కర్ణాటకలో ఓ యువకుడు ఓ అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ రీల్ చేస్తూ కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. చాలా రోజుల తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందితే గాని అతడు కోలుకోలేదు.

ఇక ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి రైలు పట్టాల మీద పడుకొని రీల్స్ చేస్తున్నారు. ఇటువంటి వీడియోలను జనాలు కూడా విపరీతంగా చూస్తున్న నేపథ్యంలో.. ఆ రీల్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఢిల్లీ ప్రాంతానికి చెందిన పవన్ అనే వ్యక్తి తుపాకీతో రీల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తుపాకి లోడ్ చేసి ఉండడంతో.. బుల్లెట్లు అతని శరీరంలోకి దూసుకుపోయాయి. చూస్తుండగానే కన్నుమూశాడు. లోడు చేసిన తుపాకీతో అతడు రీల్ చేయడం మొదలుపెట్టాడు. తుపాకీ పేలిపోవడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. చనిపోయిన పవన్ తూర్పు ఢిల్లీ ప్రాంతానికి చెందినవాడు. ఆ తుపాకీ కి సంబంధించిన బటన్ ఎలా నొక్కాలో స్నేహితుడు చెప్తుండగానే.. తుపాకీని లోడ్ చేసి.. చాతికి గుర్తుపెట్టుకున్నాడు. కెమెరా వైపు చూసి ఒక నవ్వు నవ్వాడు. ఆ వీడియోను రికార్డు చేస్తున్న వ్యక్తి.. చదువుకోవాలి కాల్చొద్దు అని చెబుతున్నప్పటికీ.. పవన్ కంగారుపడ్డాడు. తుపాకీ ట్రిగ్గర్ నొక్కేశాడు. తుపాకి నుంచి బుల్లెట్లు అతని శరీరం నుంచి దూసుకుపోయాయి. చూస్తుండగానే అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ వీడియో వివిధ మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version