WhatsApp: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. ఇక ఆ ఇబ్బంది ఉండదు..

WhatsApp: కొత్త ఫీచర్ ప్రకారం వాట్సాప్ లో చదవని, అవసరం లేని మెసేజ్ లన్నింటినీ ఒకేసారి క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిని ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్లలో పరీక్షించనున్నారు. ఇది అందుబాటులోకి రావాలంటే వాట్పాప్ ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

Written By: Neelambaram, Updated On : May 28, 2024 11:56 am

WhatsApp

Follow us on

WhatsApp: వినియోగదారులను ఆకర్షించడానికి వాట్సాప్ మాతృసంస్థ బీటా ఎప్పటి కప్పుడు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. వినియోగదారుల అభిరుచులతో పాటు వారి అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే ఎన్నో ఫీచర్లు వచ్చాయి. ఫొటోస్ నుంచి వీడియో వరకు హెచ్ డీ ఫార్మాట్ లో పంపించుకునే వీలును కలిపించింది. అలాగే సెక్యూరిటీకి సంబంధించిన ఫీచర్లు కూడా అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా మెసేజ్ క్లియర్ చేసుకునే అవకాశాన్ని కలిపిస్తూ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అదేంటంటే?

నేటి కాలంలో ప్రతీ వాట్పాప్ లో వందల కొద్దీ గ్రూపులు ఉంటున్నాయి. ఏ గ్రూపులో ఏ మెసెజ్ వస్తుందో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. దీంతో చాలా మంది అనవసర గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. కానీ ఉద్యోగాలు, వ్యాపారం చేసేవాళ్లు కొన్ని అవసరాల నిమత్తం గ్రూపుల్లో ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో గ్రూపులో వచ్చిన అనవసర మెసేజ్ లో డిలీట్ చేసుకొని ఇంపార్టెంట్ వి ఉంచుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

కొత్త ఫీచర్ ప్రకారం వాట్సాప్ లో చదవని, అవసరం లేని మెసేజ్ లన్నింటినీ ఒకేసారి క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిని ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్లలో పరీక్షించనున్నారు. ఇది అందుబాటులోకి రావాలంటే వాట్పాప్ ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత వాట్సాప్ సెట్టింగ్స్ లో నోటిఫికేషన్ అనే ఆప్షన్ పై చదవని వాటిని క్లియర్ చేయండి అని మార్క్ ఇస్తే ఆటోమేటిక్ గా అవి క్లియర్ అయిపోతాయి. దీని వల్ల అనవసర మెసేజ్ లతో ఇబ్బందులు ఉండవు.

ఎక్కువగా గ్రూపులు ఉన్న వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని బెటా తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఇది పరీక్ష దశలోనే ఉంది. త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఒక్కోసారి ఇంపార్టెంట్ మెసేజ్ లు కూడా క్లియర్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.