Parenting Tips: ఈ సమ్మర్ అలవాట్లను పిల్లల చేత తల్లిదండ్రులు మాన్పించాల్సిందే

టైమ్ అవుతుంది లెండి పిల్లలు అంటూ రోజు అమ్మ లేపితే తప్పదా అన్నట్టు లేసి సంవత్సరం మొత్తం స్కూల్ కు వెళ్లారు. అందుకే సెలవులు రాగానే ఎక్కువ సేపు పడుకుంటారు.

Written By: Swathi, Updated On : May 28, 2024 11:52 am

Parenting Tips

Follow us on

Parenting Tips: మొన్ననే ఇచ్చారు వేసవి సెలవులు అప్పుడే అయిపోయాయా అంటున్నారు కదా పిల్లలు. ఛీ మల్లీ ఫోన్, ఫ్రెండ్స్, అమ్మమ్మ, నానమ్మల ఇల్లు వదిలి బడి బాట పట్టాల్సిందేనా అంటున్నారు కదా. ఇక అలవాట్లు కూడా చాలా అయ్యాయి కదా. మరి స్కూల్ కు వెళ్లేటప్పుడు చాలా అలవాట్లను మార్చుకోవాల్సిందే. లేదంటే చాలా కష్టం. మరి ఏ అలవాట్లను మార్చుకోవాలో ఓ సారి తెలుసుకుందామా?

టైమ్ అవుతుంది లెండి పిల్లలు అంటూ రోజు అమ్మ లేపితే తప్పదా అన్నట్టు లేసి సంవత్సరం మొత్తం స్కూల్ కు వెళ్లారు. అందుకే సెలవులు రాగానే ఎక్కువ సేపు పడుకుంటారు. రాత్రి మొత్తం టీవీ, ఫోన్ లు చూసి ఉదయం లేటుగా లేస్తారు. మొత్తం మీద నిద్ర హాబిట్ మార్చుకున్నారు. సో మళ్లీ ఉదయం లేవాల్సిందే. చాలా తక్కువ సమయమే ఉంది కాబట్టి మీ పిల్లలకు అలవాటు చేయండి.

నచ్చినంత సేపు టీవీలు చూస్తుంటారు. సెలవుల్లో కావాల్సినంత సమయం ఉంటుంది కాబట్టి పనుల్ని వాయిదా వేసినా తర్వాత చేసుకోవచ్చు. కానీ ఒకసారి స్కూల్స్ మొదలైతే వాయిదా పద్ధతి అలవాటు అవుతుంది. ఇలా అయితే ఒత్తిడి, ఆందోళన తప్పదు అని గుర్తు పెట్టుకోండి. దీనివల్ల మానసిక అనారోగ్యం మీద దెబ్బతింటుంది. సెలవులు ఉన్నప్పుడు టీవీలో సినిమాలు, ఇతర షోలు చూడటం తప్పు కాదు.. కానీ అదే పనిగా చూస్తేనే ప్రమాదం. రోజంతా టీవీకి అతుక్కుపోయే అలవాటుకు ఇక స్వస్తీ చెప్పేసేయండి.

పుస్తకాలు తీయడం, ఆరుబయట గడపడం, స్నేహితులు, బంధువులతో కలిసి మాట్లాడటం అలవాటు చేసుకోండి. జంగ్ ఫుడ్స్ కు గుడ్ భాయ్ చెప్పి పండ్లు, కూరగాయలు, గింజలు వంటివి తినండి. చక్కెర పానీయాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారాల జోలికి వెళ్లకండి. స్కూల్స్ స్ట్రాట్ అవుతున్నాయి కాబట్టి ఇన్ని రోజులు చేసిన ఎంజాయ్ ను ఒక జ్నాపంగా ఉంచుకుంటూ ఆడుతూ పాడుతూ భవిష్యత్తు కోసం ఇక పరుగులు పెట్టండి.