Homeఆధ్యాత్మికంMustard oil: ఈ రోజున ఆవనూనె దానం చేస్తే.. బాధలన్నీ దూరం

Mustard oil: ఈ రోజున ఆవనూనె దానం చేస్తే.. బాధలన్నీ దూరం

Mustard oil: Mustard oil:వారానికి ఏడు రోజులు ఉంటాయి. ఒక్కో వారానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వారంలో ఉన్న ఒక్కో వారం ఒక్కో దేవున్ని పూజిస్తారు. అయితే అన్ని వారాల కంటే శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ శనివారం నాడు అందరూ కూడా తప్పకుండా పూజలు నిర్వహిస్తారు. ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుంటారు. ముఖ్యంగా అయితే శని దేవున్ని పూజిస్తారు. కొందరి జీవితాల్లో శని ఉంటుంది. ఇది పోవాలంటే తప్పకుండా శనీశ్వరుని అనుగ్రహం కలగాలని భావిస్తారు. శనీశ్వరుని శనివారం పూజించడం వల్ల అన్ని సమస్యలు తీరిపోయి చాలా సంతోషంగా ఉంటారని పండితులు చెబుతుంటారు. మన జీవితంలో ఉన్న శని అంతా పోవాలని నువ్వులు, నువ్వుల నూనె వంటి వాటితో శనీశ్వరుడిని అభిషేకం చేస్తారు. అలాగే కొన్ని వస్తువులను దానం చేస్తుంటారు. అయితే శనివారం రోజున తప్పకుండా ఆవ నూనె దానం చేయాలని పండితులు అంటున్నారు. ఈ నూనెను శనివారం రోజున దానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.

శనివారం రోజున శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఆ తర్వాత ఆవనూనెలో నీడను చూసి దానం చేయాలని పండితులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల శత్రు బాధలన్నీ తొలగిపోతాయట. అయితే దీని వెనుక ఓ కారణం ఉంది. హనుమంతుడు శనిదేవునికి ఆవనూనెతో అభిషేకం చేశాడట. దీంతో తన బాధలు అన్ని తొలగిపోయాయి. దీంతో అప్పటి నుంచి శని దేవునికి ఆవనూనెతో అభిషేకం చేస్తారట. ఆవనూనెలో నీడను చూసి దీన్ని దానం చేయడం వల్ల మరణ భయం, శతృ బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగి పోతాయని పండితులు అంటుంటారు. అలాగే అగ్ని, నీరు, వాహన ప్రమాదాలు జరగకుండా కాపాడతాయని పండితులు చెబుతున్నారు. ఇవే కాకుండా శనివారం రోజు నల్లటి వస్తువులు, నువ్వులు వంటివి దానం చేయడం వల్ల శని దేవుని వల్ల వచ్చే సమస్యలు అన్ని క్లియర్ అవుతాయి. ఎవరైతే కటిక పేదరికంలో ఉంటారో వారు తప్పకుండా శనివారం రోజు ఆవనూనెను దానం చేయాలి. ఇలా చేస్తే వారి పేదరికం అంతా పోయి.. ఆర్థికంగా మంచి పొజిషన్‌లో ఉంటారు.

శనివారం అనేది శనీశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనది. ఈ రోజు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా తలస్నానం చేయాలి. తలకు ఆయిల్ పెట్టకూడదు. శరీరానికి కూడా నువ్వుల నూనె వంటివి అప్లై చేయకూడదు. నువ్వులు తినకూడదు. తెలియక ఇలాంటి చిన్న తప్పులు చేయడం వల్ల జీవితంలో దరిద్రం తాండవిస్తుంది. శతృ బాధలు, ఆర్థిక సమస్యలు, కష్టాలు, అనారోగ్య సమస్యలు ఇలా ఒకటేంటి.. ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీతోనే ఉంటాయని పండితులు అంటున్నారు. కాబట్టి ఇలాంటి చిన్న తప్పులు చేయకుండా శనివారం రోజు నియమ నిష్టతో ఉండండి. దీనివల్ల ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version