Mustard oil: Mustard oil:వారానికి ఏడు రోజులు ఉంటాయి. ఒక్కో వారానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వారంలో ఉన్న ఒక్కో వారం ఒక్కో దేవున్ని పూజిస్తారు. అయితే అన్ని వారాల కంటే శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ శనివారం నాడు అందరూ కూడా తప్పకుండా పూజలు నిర్వహిస్తారు. ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుంటారు. ముఖ్యంగా అయితే శని దేవున్ని పూజిస్తారు. కొందరి జీవితాల్లో శని ఉంటుంది. ఇది పోవాలంటే తప్పకుండా శనీశ్వరుని అనుగ్రహం కలగాలని భావిస్తారు. శనీశ్వరుని శనివారం పూజించడం వల్ల అన్ని సమస్యలు తీరిపోయి చాలా సంతోషంగా ఉంటారని పండితులు చెబుతుంటారు. మన జీవితంలో ఉన్న శని అంతా పోవాలని నువ్వులు, నువ్వుల నూనె వంటి వాటితో శనీశ్వరుడిని అభిషేకం చేస్తారు. అలాగే కొన్ని వస్తువులను దానం చేస్తుంటారు. అయితే శనివారం రోజున తప్పకుండా ఆవ నూనె దానం చేయాలని పండితులు అంటున్నారు. ఈ నూనెను శనివారం రోజున దానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
శనివారం రోజున శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఆ తర్వాత ఆవనూనెలో నీడను చూసి దానం చేయాలని పండితులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల శత్రు బాధలన్నీ తొలగిపోతాయట. అయితే దీని వెనుక ఓ కారణం ఉంది. హనుమంతుడు శనిదేవునికి ఆవనూనెతో అభిషేకం చేశాడట. దీంతో తన బాధలు అన్ని తొలగిపోయాయి. దీంతో అప్పటి నుంచి శని దేవునికి ఆవనూనెతో అభిషేకం చేస్తారట. ఆవనూనెలో నీడను చూసి దీన్ని దానం చేయడం వల్ల మరణ భయం, శతృ బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగి పోతాయని పండితులు అంటుంటారు. అలాగే అగ్ని, నీరు, వాహన ప్రమాదాలు జరగకుండా కాపాడతాయని పండితులు చెబుతున్నారు. ఇవే కాకుండా శనివారం రోజు నల్లటి వస్తువులు, నువ్వులు వంటివి దానం చేయడం వల్ల శని దేవుని వల్ల వచ్చే సమస్యలు అన్ని క్లియర్ అవుతాయి. ఎవరైతే కటిక పేదరికంలో ఉంటారో వారు తప్పకుండా శనివారం రోజు ఆవనూనెను దానం చేయాలి. ఇలా చేస్తే వారి పేదరికం అంతా పోయి.. ఆర్థికంగా మంచి పొజిషన్‌లో ఉంటారు.
శనివారం అనేది శనీశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనది. ఈ రోజు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా తలస్నానం చేయాలి. తలకు ఆయిల్ పెట్టకూడదు. శరీరానికి కూడా నువ్వుల నూనె వంటివి అప్లై చేయకూడదు. నువ్వులు తినకూడదు. తెలియక ఇలాంటి చిన్న తప్పులు చేయడం వల్ల జీవితంలో దరిద్రం తాండవిస్తుంది. శతృ బాధలు, ఆర్థిక సమస్యలు, కష్టాలు, అనారోగ్య సమస్యలు ఇలా ఒకటేంటి.. ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీతోనే ఉంటాయని పండితులు అంటున్నారు. కాబట్టి ఇలాంటి చిన్న తప్పులు చేయకుండా శనివారం రోజు నియమ నిష్టతో ఉండండి. దీనివల్ల ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.