https://oktelugu.com/

Chips packets: చిప్స్‌ ప్యాకెట్లలో గాలి ఎందుకు ఉంటుంది? దీనికి కారణం ఏంటి?

సాధారణంగా చిప్స్ ప్లాకెట్లలో గాలి ఉంటుంది. చూడటానికి వీటిలో ఎక్కువ చిప్స్ ఉన్నట్లు ఉంటాయి. కానీ లోపల గ్యాస్ తప్ప ఏం ఉండదు. కేవలం చిన్న ప్యాకెట్లలోనే ఇలా ఉంటాయా? అంటే కాదు. ఎలాంటి చిప్స్ ప్యాకెట్లలో అయిన కూడా ఇలానే ఉంటాయి. అసలు ఎందుకు చిప్స్ ప్యాకెట్లలో ఎక్కువ గాలి నింపుతారు? దీనికి గల కారణాలు ఏంటి? ఏ గ్యాస్‌ను నింపుతారో తెలియాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2024 / 06:10 AM IST

    chips

    Follow us on

    Chips packets: చిప్స్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికీ ఇష్టమే. వీటిని చాలా ఇష్టంగా తింటారు. చిన్న ముక్క తిన్నా కూడా ఇంకా తినాలనేపిస్తుంది. స్పైసీ, సాల్ట్ ఇలా ఎన్నో ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయిన కూడా అందరూ వీటిని తినడానికే ఇష్టపడుతుంటారు. సాధారణంగా చిప్స్ ప్లాకెట్లలో గాలి ఉంటుంది. చూడటానికి వీటిలో ఎక్కువ చిప్స్ ఉన్నట్లు ఉంటాయి. కానీ లోపల గ్యాస్ తప్ప ఏం ఉండదు. కేవలం చిన్న ప్యాకెట్లలోనే ఇలా ఉంటాయా? అంటే కాదు. ఎలాంటి చిప్స్ ప్యాకెట్లలో అయిన కూడా ఇలానే ఉంటాయి. అసలు ఎందుకు చిప్స్ ప్యాకెట్లలో ఎక్కువ గాలి నింపుతారు? దీనికి గల కారణాలు ఏంటి? ఏ గ్యాస్‌ను నింపుతారో తెలియాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీ మొత్తం చదివేయండి.

    చిప్స్‌ను రకరకాల పదార్థాలతో ఆయిల్‌లో వేసి తయారు చేస్తారు. సాధారణంగా ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మహా అయితే ఒక నెల రోజుల వరకు మాత్రమే ఉంటాయి. చిప్స్‌ను నార్మల్‌గా ప్యాకింగ్ చేసి వదిలితే అవి తొందరగా పాడవుతాయి. సాధారణంగా ప్యాకింగ్ చేస్తే అందులోకి బ్యాక్టీరియా వెళ్లిపోతుంది. దీంతో చిప్స్ తొందరగా దెబ్బతింటాయి. కాబట్టి ఇందులో నైట్రోజన్‌ గ్యాస్‌ను నింపుతారు. ఈ గ్యాస్‌ను నింపడం వల్ల ఎలాంటి బ్యాక్టీరియా చిప్స్ ప్యాకెట్‌లోకి వెళ్లదు. అలాగే ప్యాకెట్‌లు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువుని తగిన పీడనంలో నింపడం వల్ల అవి మెత్తగా కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. దీంతో తినడానికి చిప్స్ ప్యాకెట్స్ టేస్టీగా ఉంటాయి.

    చిప్స్ ప్యాకెట్లలో గాలి లేకపోతే అవి తొందరగా విరిగిపోతాయి. ప్యాకెట్లలో గాలి లేకపోవడం వల్ల వాటి మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీంతో చిప్స్ చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి. అలాగే వీటిని రవాణా చేసేటప్పుడు కూడా గాలి వల్ల అవి విరగకుండా ఉంటాయి. అందుకే చిప్స్ ప్యాకెట్‌లో నైట్రోజన్ వాయువును నింపుతారు. చిప్స ప్యాకెట్స్‌లో ఈ గ్యాస్ ఎందుకు వేరే గ్యాస్ ఏదైనా నింపవచ్చని మీకు సందేహం రావచ్చు. కానీ వేరే గ్యాస్‌ను నింపడం వల్ల చిప్స్ తొందరగా పాడవుతాయి. ఉదాహరణకు చిప్స్ ప్యాకెట్లలో ఆక్సిజన్ నింపితే.. అది ఆహార పదార్థాలతో చర్య జరుపుతుంది. దీంతో చిప్స్ తొందరగా పాడవుతాయి. అందుకే చిప్స్ ప్యాకెట్లలో కేవలం నైట్రోజన్ వాయువుని మాత్రమే నింపుతారు. అయితే ఈ చిప్స్ ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా దుంపలతో చేసిన వాటిని అయితే అసలు తినకూడదు. వీటిని తినడం వల్ల కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువ శాతం పిల్లలు చిప్స్ కావాలని అడుగుతారు. పిల్లలకు అయితే అసలు ఈ చిప్స్ ఇవ్వకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.