Wimbledon టెన్నిస్ చరిత్రలో గ్రాండ్ స్లామ్ లలో ప్రత్యేకమైనది వింబుల్డన్. ఇంగ్లాండ్ వేదికగా ప్రతి ఏడాది ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో విజయం సాధించడానికి ఆటగాళ్లు విపరీతంగా శ్రమిస్తారు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు మొత్తం ఈ టోర్నీ చూసేందుకు వస్తుంటారు. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద దిగ్గజ సంస్థలు ఈ టోర్నికి స్పాన్సర్ గా వ్యవహరిస్తుంటాయి. సాధారణంగా టెన్నిస్ పోటీలలో గ్రాండ్ స్లామ్ గెలిస్తే భారీగా ప్రైజ్ మనీ లభిస్తుంది. అయితే వింబుల్డన్ లో విజేతగా గెలిస్తే ప్రైజ్ మనీ మాత్రమే కాదు.. అంతకుమించిన సదుపాయాలు, సౌకర్యాలు లభిస్తాయి.
Carlos Alcaraz, YOU CANNOT DO THAT #Wimbledon pic.twitter.com/pGzjqJj7Bo
— Wimbledon (@Wimbledon) July 13, 2025
వింబుల్డన్ విజేతగా నిలిచిన వారికి సెంటర్ కోర్టులో టెన్నిస్ మ్యాచ్ లు చూసే అవకాశం ఉంటుంది.. క్లబ్ సౌకర్యాలు.. రిజర్వ్ సీట్లు వారి కోసం కేటాయించి ఉంటాయి. వింబుల్డన్ లో విజేతగా గెలిచినవారు ప్రైజ్ సెర్మనీలో డాన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెన్స్, ఉమెన్స్ సింగిల్స్ లో విజేతలుగా నిలిచిన వారు డాన్స్ చేయవచ్చు. విజేతగా నిలిచిన వారికి 3/4 పరిమాణంలో రెప్లికా(నిజమైన ట్రోఫీ ఆకృతి.. ఇది బంగారంతో రూపొందించి ఉంటుంది.) ఇస్తారు. అయితే నిజమైన ట్రోఫీ మాత్రం వింబుల్డన్ మ్యూజియంలో ఉంటుంది. విజేతలుగా నిలిచిన వారు ఏకాఏకిన రెండు వేల ర్యాంకింగ్ పాయింట్లు సాధిస్తారు.
ఇక ఈ ఏడాది విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. 53.5 మిలియన్ పౌండ్లు ప్రైజ్ మనీ గా వింబుల్డన్ కమిటీ నిర్ణయించింది. ఇందులో సింగిల్స్ విజేతలకు మూడు మిలియన్ పౌండ్ల చొప్పున నగదు బహుమతిగా అందిస్తారు. విజేతగా నిలిచినవారు రాయల్ బాక్స్ బాల్కనీలో జరిగే వేడుకల్లో ట్రోఫీ అందుకుంటారు. విజేతలుగా ఆవిర్భవించిన వారికి ఛాంపియన్ జాబితాలో చోటు లభిస్తుంది.
విజేతలకు మాత్రమే కాకుండా రన్నరప్ లకు కూడా భారీగానే ఈసారి నగదు బహుమతి అందం ఉంది. రన్నర్ అప్ గా నిలిచిన వారికి 15, 20,000 పౌండ్లు అందిస్తారు. ఇది మన దేశ మారకంలో 17 కోట్ల 68 లక్షలతో సమానం. సెమీఫైనల్ లో ఓడిన వారికి 7,75,000 పౌండ్లు లభిస్తాయి. అవి మన కరెన్సీలో తొమ్మిది కోట్ల వరకు ఉంటాయి. క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయిన వారికి నాలుగు లక్షల పౌండ్లు.. మన కరెన్సీలో నాలుగు కోట్ల 65 లక్షల చొప్పున లభిస్తుంది. ప్రి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన వారికి రెండు లక్షల 40 వేల పౌండ్లు లభిస్తాయి. అది మన మారకంలో రెండు కోట్ల 79 లక్షల వరకు ఉంటుంది. మూడవ రౌండ్ లో ఓడిపోయిన వారికి 1,52,000 పౌండ్లు లభిస్తాయి. అవి మన కరెన్సీలో ఒక కోటి 72 లక్షల వరకు ఉంటుంది. రెండవ రౌండ్లో ఓటమి పాలైన వారికి 99,000 పౌండ్లు లభిస్తాయి. అవి మన కరెన్సీలో ఒక కోటి 15 లక్షల వరకు ఉంటుంది. తొలి రౌండ్లో ఓడిపోతే 66 వేల పౌండ్లు లభిస్తాయి. అది మన కరెన్సీలో 77 లక్షల వరకు ఉంటుంది. డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించిన వారికి ఆరు లక్షల 80 వేల పౌండ్లు లభిస్తాయి. అది మన కరెన్సీలో ఏడు కోట్ల 91 లక్షలతో సమానం. ఇక గత ఏడాది ఆల్కరాస్(పురుషులు), క్రేజీ కోవా (స్త్రీలు) విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే.