Hair fall control : జుట్టుకు నూనె రాసుకోవడం చాలా అవసరం. చుండ్రు, జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలతో చాలా మంది బాధ పడుతుంటారు. అయితే ఏ సమస్యకు ఏ షాంపూ వాడాలి? ఏ నూనె వాడాలి అంటూ తెగ టెన్షన్ పడుతుంటారు ప్రజలు. అయితే మీరు ఎన్ని ఖరీదైన షాంపూలు వాడినా సరే, ఎన్ని ఖరీదైన నూనెలు వాడినా సరే మంచి ఫలితం లేదా? అవన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం జుట్టు కోసం ఉపయోగపడే టాప్ హెయిర్ ఆయిల్స్ ను చూసేద్దాం. ఛలో మరి.
Also Read: ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న టాప్ 3 తెలుగు డైరెక్టర్స్ వీళ్లేనా..?
ఉసిరి నూనె
ఈ ఉసిరి నూనె చాలా ఉపయోగపడుతుంది. ఉసిరి నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇవి జుట్టులోని పేను వంటి పరాన్నజీవులను చంపుతాయి. తలపై దురద, చుండ్రును కూడా నివారిస్తుంది. ఉసిరి నూనెలో విటమిన్లు, పెక్టిన్లు, ఫైటోన్యూట్రియెంట్లు, జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే అనేక మినరల్స్ కూడా ఇందులో ఉంటాయట. అటు ఫైటోన్యూట్రియెంట్లు జుట్టు పెరుగుదలను, జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి. బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల కోసం ఆమ్లా నూనెను మీ జుట్టు అప్లే చేసుకోవచ్చు. ఇది టాప్ ఆయిల్.
బృంగరాజ్ ఆయిల్: ఈ నూనె బృంగరాజ్ అనే మొక్క నుంచి వస్తుంది. దాని ఆకులతో తయారు చేస్తారు. జుట్టు పెరుగుదలకు, ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు చాలా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద వైద్యంలో ముఖ్యమైనదిగా పరిగణిస్తుంటారు కూడా. బృంగరాజ్ నూనె జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. జుట్టు పెరుగుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బృంగరాజ్ నూనె జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది చుండ్రును నివారిస్తుంది.
మందార నూనె:
మందార పువ్వు రేకుల నుంచి తీసిన మందార నూనెను చాలా మంది ఉపయోగిస్తారు. ఇది కూడా టాప్ ఆయిల్ లో ఒకటి. మంచిది కూడా. విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును బలపరుస్తాయి. చివరలు చిట్లకుండా కాపాడుతుంది. జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఇది తలలో లోతుగా చొచ్చుకుపోతుంది కాబట్టి సహజమైన మెరుపు కూడా అందుతుంది.
Also Read: విశ్వంభర’ విడుదలకు లైన్ క్లియర్..పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇక నిరాశే!
కొబ్బరి నూనె:
చాలా మంది ఇంట్లో ఉండే నూనె. భారతీయ జుట్టు సంరక్షణ కోసం ఎక్కువ ఉపయోగించే నూనె కూడా ఇదే. కొబ్బరికాయల నుంచి సేకరించిన ఇది కొవ్వు ఆమ్లాలు, ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. జుట్టు కుదుళ్లకు లోతైన పోషణను అందిస్తాయి. కొబ్బరి నూనె జుట్టు కుదుళ్లను బలపరచడంలో సహాయం చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండి చుండ్రును నివారిస్తుంది.
బాదం నుంచి తీసిన ఈ నూనెలో విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. జుట్టు పొడవును మెరుగుపరచి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. బాదం నూనె జుట్టు కుదుళ్లను పోషించి, మెరుపును అందిస్తుంది. తలపై చర్మం వాపును తగ్గించి, జుట్టు చివరలను మృదువుగా చేస్తుంది. అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అంతేకాదు ఇది జుట్టులోకి లోతుగా చొచ్చుకుపోతుంది. రక్త ప్రసరణ, మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ బాదం నూనె.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.